News February 12, 2025
సరూర్ నగర్: రేపు కబడ్డీ జట్ల ఎంపిక

రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు రేపు సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. రేపు మధ్యాహ్నం 3 గం.కు ఎంపిక ఉంటుందని, 16 ఏళ్లలోపు బాల బాలికలు ఆధార్ కార్డుతో ఎంపికకు హాజరు కావాలన్నారు. ఎంపికైన వారు వికారాబాద్ జిల్లాలో జరిగే 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా పోటీల్లో ఆడుతారన్నారు.
Similar News
News July 4, 2025
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ: డీఐఈఓ

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసిందని వనపర్తి DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లాలో మొత్తం 12 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. వాటి అభివృద్ధికి రూ. 1.28 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఆయా కళాశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులు, విద్యుత్, తదితర పనులు చేపట్టనున్నారని తెలిపారు.
News July 4, 2025
మార్కాపురం జిల్లాపై మాటెత్తని పవన్..!

మార్కాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటనపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మార్కాపురాన్ని ఎప్పుడు జిల్లా చేస్తామనే దానిపై ఆయన ప్రకటన చేస్తారని ఆశగా చూశారు. కానీ మార్కాపురం జిల్లాపై ఆయన ఏం మాట్లాడలేదు. వెలిగొండ ప్రాజెక్టు భూనిర్వాసితులకు నిధుల కేటాయింపుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇవాళ ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులను తానే పర్యవేక్షిస్తూ 20నెలల్లోనే పూర్తి చేస్తామని చెప్పడం కాస్త ఊరటనిచ్చే అంశం.
News July 4, 2025
వరంగల్ మార్కెట్లో తగ్గిన పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర మళ్లీ పడిపోయింది. గత 3 నెలల వ్యవధిలో ఎన్నడూ లేని విధంగా గురువారం క్వింటా పత్తి ధర రూ.7,565 నమోదవగా.. నేడు రూ.7,390కి తగ్గింది. ఒకరోజు వ్యవధిలోనే రూ.175 తగ్గడంతో పత్తి రైతులు నిరాశ చెందుతున్నారు. కాగా, నేడు మార్కెట్‌కు పత్తి అంతంత మాత్రంగానే వచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు.