News February 26, 2026
సరైన నిద్రలేకపోతే అందానికి దెబ్బ

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ నిద్రలేమి వేధిస్తోంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ఇది అందాన్నీ దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేకపోతే శరీరం పీహెచ్ దెబ్బతిని చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. దీంతో వయసు పైబడినట్లు కనిపిస్తారు. అలాగే డార్క్ సర్కిల్స్, కళ్ల వాపు, ముడతలు, జుట్టు రాలిపోవడం వంటివి కూడా వస్తాయని చెబుతున్నారు.
Similar News
News March 2, 2026
రాహుల్ జీ.. 2 లక్షల ఉద్యోగాలివ్వండి: కవిత

INC నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఆయనపై జాగృతి చీఫ్ కవిత విమర్శలు గుప్పించారు. ‘రాహుల్ జీ దో లాక్ నౌకరీ దో’ అంటూ ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలిస్తామన్నారు. మీ హామీని నమ్మి శిక్ష అనుభవిస్తున్న నిరుద్యోగుల గోడు పట్టదా? యూత్ డిక్లరేషన్ బోగస్‌గా మారింది. జాబ్ క్యాలెండర్ పత్తాలేదు. కాంగ్రెస్ అంటేనే మోసం, వంచన అనే మాటను నిలబెట్టుకున్నారు’ అని విమర్శించారు.
News March 2, 2026
వార్ ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లు పతనమయ్యాయి. వార్ ఎఫెక్ట్‌తో ఈరోజంతా బ్లడ్ బాత్ తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. విమాన సర్వీసుల రద్దుతో ఇండిగో షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదానీ పోర్ట్స్, ఎటర్నల్, L&T, ఏషియన్ పేయింట్స్ షేర్లూ నష్టాల్లో ఉన్నాయి.
News March 2, 2026
తిరుపతిలోని SVIMSలో ఉద్యోగాలు

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (<


