News October 7, 2025

సరైన రీతిలో వాదనలు వినిపించాలి: కలెక్టర్

image

ఏలూరు గౌతమీ సమావేశ మందిరంలో కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన మంగళవారం ఫారెస్ట్, కొల్లేరు పరీవాహక ప్రాంతాల అధికారులతో సమావేశం జరిగింది. ఫారెస్ట్ స్పెషల్ సెక్రటరీ కాంతీలాల్ దండే పాల్గొన్నారు. కొల్లేరు అంశంపై సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదనలలో మన తరపున సరైన రీతిలో వాదనలు వినిపించాలని కలెక్టర్ కోరారు. అలాగే కాంటూరు కుదింపు కారణంగా ఉపాధి కోల్పోయిన జి.రాయితీ రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు.

Similar News

News April 14, 2026

తాండూరులో కలగానే ‘కంది బోర్డు’

image

తాండూరులో కంది బోర్డు కలగానే మిగిలిపోయింది. తాండూరు, పెద్దేముల్, యాలాల్, బషీరాబాద్ మండలాల్లో సుమారు 2 లక్షల ఎకరాల్లో రైతులు కంది పంటను సాగు చేస్తున్నారు. కంది బోర్డును ఏర్పాటు చేస్తే రైతులకు నేరుగా విత్తనాలు, సబ్సిడీలు, మంచి మార్కెట్ ధర లభిస్తుంది. కంది బోర్డు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. కొంతకాలంగా కంది బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

News April 14, 2026

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్?

image

Jr.NTR బర్త్‌డే సందర్భంగా మే 20న ఆయన సినిమాలకు సంబంధించి రెండు స్పెషల్ అప్‌డేట్స్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ నుంచి టీజర్ వస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీపై అఫీషియల్ ప్రకటన, స్పెషల్ పోస్టర్ రానున్నట్లు పేర్కొన్నాయి. అదే రోజున ‘దేవర-2’పైనా మేకర్స్ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

News April 14, 2026

CSKతో మ్యాచ్.. టాస్ గెలిచిన KKR

image

IPL 2026: చెన్నైతో జరగనున్న మ్యాచులో KKR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
CSK: శాంసన్, గైక్వాడ్, ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్, శివమ్ దూబే, బ్రెవిస్, ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్.
KKR: రహానె, గ్రీన్, రఘువంశీ, పావెల్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, నరైన్, రమణ్‌దీప్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.