News September 2, 2025
సరోగసి ద్వారా చికిత్స చేసే వారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి

నెల్లూరు డిఎంహెచ్వో సుజాత కీలక ఆదేశాలు జారీ చేశారు. గర్భాశయ గర్భధారణ, ప్రయోగశాలలో ఫలదీకరణ(IVF), వీర్యం, అండాలను భద్రపరిచే బ్యాంకులు, అద్దె గర్భము(సరోగసి) ద్వారా చికిత్సలు చేసేవారు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. సంబంధిత నేషనల్ రిజిస్ట్రేషన్ పోర్టర్లో నిర్ణిత ఫీజులు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జిల్లా వైద్యాధికారి వద్ద అనుమతి పత్రాన్ని తీసుకోవాలన్నారు.
Similar News
News September 14, 2025
కృష్ణాపురం నవోదయలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ దాష్టీకం

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి స్టడీ అవర్స్‌లో మహేష్ అనే విద్యార్థిపై ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ పెత్తన స్వామి దాడికి పాల్పడ్డారు. దీంతో మహేశ్ తలకు తీవ్ర గాయం అయ్యింది. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని వాష్ రూమ్‌లో లాక్ చేసిన ఉదయం వరకు లాక్ తియ్యొద్దని స్టాఫ్‌ని హెచ్చరించారు. టీచర్లు కలిసి విద్యార్థిని మర్రిపాడు ఆస్పత్రికి తరలించారు.
News September 14, 2025
నెల్లూరు: కూలితే.. తల బద్దలే..!

నెల్లూరు ప్రసూతీ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో సోలార్ లైటింగ్ పోల్ పక్కకు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. నిత్యం వండలాది మంది రోగులు వచ్చే ఆసుపత్రి ఆవరణలో ఈ సమస్య చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఆసుపత్రి సిబ్బంది, అధికారులకు ఈ దృశ్యం కనిపించడం లేదా అన్నది ప్రశ్నగా ఉంది. ఇకనైనా స్పందించకపోతే ఎవరిపైనా అయినా పడిపోయే అవకాశం ఉంది. పెనుప్రమాదం జరగక ముందే దాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
News September 14, 2025
ఉలవపాడు: కరేడులో టెన్షన్..టెన్షన్

ఉలవపాడు(M) కరేడులో ఆదివారం అంతటా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆంక్షల నడుమ బోడె రామచంద్ర యాదవ్ మీటింగ్ జరగాల్సి ఉండటంతో పరిణామాలు ఎలా దారి తీస్తాయో అన్న టెన్షన్ అందరిలో ఏర్పడింది. జులై 29న జరిగిన హైవే దిగ్బంధం కార్యక్రమంలో కూడా బోడె రామచంద్ర వెంట అనూహ్యంగా వేలాది మంది కరేడు ప్రజలు దూసుకొచ్చిన ఘటన తెలిసిందే. ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.