News August 9, 2025

సర్కారీ భవనాలపై సోలార్ ప్యానెల్స్.. 7రోజుల్లో వివరాలు పంపాలి’

image

రాష్ట్రవ్యాప్తంగా GOVT. కార్యాలయాలపై యుద్ధప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక- ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన, గ్రామపంచాయతీ నుంచి సెక్రటేరియట్ వరకు అన్ని కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల వివరాలు 7 రోజుల్లో పంపాలని కోరారు. ROFR భూములపై సోలార్ పంపు సెట్లు 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలన్నారు.

Similar News

News August 10, 2025

మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా: KTR

image

TG: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కావొస్తుండటంపై మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘KCR హయాంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించాం. నల్గొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం, సిద్దిపేటలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఈ లిస్టులో చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం మా సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.

News August 10, 2025

KNR: ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. రేపే చివరి తేదీ

image

KNR జిల్లా BC స్టడీ సర్కిల్లో గ్రూప్- 1, 2, 3, 4, RRB, SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే(ఆగస్ట్ 11) చివరి తేదీ అని డైరెక్టర్ డా.మంతెన రవికుమార్ తెలిపారు. అర్హులైన జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తరగతులు ఆగస్ట్ 25 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు.

News August 10, 2025

ఆన్‌లైన్‌లోనే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల స్టేటస్: జనగామ కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో తెలుసుకునే సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బిల్లుల పేమెంట్‌తో పాటు ఇంటి పురోగతి స్టేటస్ తెలుసుకునేందుకు లబ్ధిదారులు ముందుగా https://indirammaindlu.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆధార్ నంబర్/ మొబైల్ నంబర్/ FSC నంబర్/లేదా అప్లికేషన్ నంబర్ ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలన్నారు. దీంతో ఇంటి నిర్మాణానికి సంబంధించిన వివరాలు వస్తాయన్నారు.