News January 9, 2026

సర్దాపూర్: ‘మిమ్మల్ని చూస్తే ఐపీఎస్ శిక్షణ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి’

image

మిమ్మల్ని చూస్తే 2019లో తాను ఐపీఎస్ శిక్షణ తీసుకున్న ఙ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. సర్దాపూర్ 17వ పోలీస్ బెటాలియన్ వార్షిక క్రీడా పోటీల ముగింపు వేడుకలకు ఆమె హాజరై మాట్లాడారు. ఫిట్నెస్ క్రమశిక్షణ, నిత్యజీవితంలో ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. యోగా, వ్యాయామం, నడక ఏదైనా తప్పనిసరిగా చేయాలని సూచించారు. విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు.

Similar News

News January 11, 2026

మన ఊరు.. ఫస్ట్ విజువల్ ఏంటి..?

image

ఉద్యోగం, ఉపాధి, ఉన్నత చదువుల కోసం ఊరిని వీడిన వారంతా పండగకు తిరిగి వచ్చేస్తున్నారుగా! సొంతూరు ఆలోచన రాగానే గుడి, చదివిన బడి, ఆడుకున్న చెట్టు, వీధి చివర షాపు, మన పొలం, ఊరి చెరువు.. ఇలా ఓ స్పెషల్ విజువల్ మన మైండ్‌లోకి వస్తుంది. ఎప్పుడు ఊరికొచ్చినా ఆ ప్లేస్‌కు వెళ్లడమో, దాని అప్డేట్ తెలుసుకోవడమో పక్కా. మన ఊర్లో మీకున్న ఆ ప్లేస్ ఏంటి? ఈ ఆర్టికల్‌ను మన ఊరి గ్రూప్స్‌లో షేర్ చేయండి, కామెంట్ చేయండి.

News January 11, 2026

‘హిజాబ్ పీఎం’ వ్యాఖ్యలు.. ఒవైసీ vs హిమంత!

image

హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన <<18819394>>వ్యాఖ్యలపై<<>> మాటల యుద్ధం జరుగుతోంది. ‘ఎవరైనా PM కావచ్చు. కానీ ఇది హిందూ దేశం. హిందూ వ్యక్తే PMగా ఉంటారని మేం నమ్ముతాం’ అని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ అన్నారు. దీంతో హిమంత తలలో ట్యూబ్ లైట్ ఉందని ఒవైసీ ఎద్దేవా చేశారు. దేశం ఏ ఒక్క కమ్యూనిటీకి సొంతం కాదనే రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరమన్నారు.

News January 11, 2026

మరణించిన వారిని దూషిస్తే..?

image

మరణించిన వ్యక్తిని నిందించినా, దూషించినా, అవమానించినా శాస్త్రాల ప్రకారం నేరం. మనుస్మృతి, భారతంలోని శాంతి పర్వం ప్రకారం.. వారు తిరిగి సమాధానం చెప్పలేరు కాబట్టి వారి గురించి చెడుగా మాట్లాడటం పిరికిపంద చర్యగా పేర్కొంటారు. ఇలా చేస్తే మనలోని సానుకూల శక్తి నశించి, ప్రతికూలత పెరుగుతుంది. మరణించిన వారు చేసిన తప్పుల కంటే వారిలోని మంచిని మాత్రమే గుర్తుంచుకోవాలి. లౌకిక బంధాలు ముగిసిన వారు దైవంతో సమానం.