News October 21, 2025
సర్ధార్@150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయండి: కలెక్టర్

సర్ధార్ @150 యూనిటీ మార్చ్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్‌లో సర్ధార్ 150@ యూనిటీ మార్చ్ ఏక్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ పాదయాత్ర పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం పురస్కరించుకొని ఈ నెల 31న నిర్వహించబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యువతీ, యువకులకు సూచించారు.
Similar News
News October 22, 2025
సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంబదూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టు కోసం 4,292.28 ఎకరాలు గుర్తించామని, పెండింగ్‌లో ఉన్న 984.53 ఎకరాల భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
News October 21, 2025
‘రిజర్వేషన్ అమలులో మహా మోసం’

రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మహా మోసం జరిగిందని రిజర్వేషన్ సాధికార సమితి అధ్యక్షుడు జీవీ ఉజ్వల్ ఆరోపించారు. అనంతపురంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాలలో రిజర్వేషన్ కటాఫ్ కంటే ఓపెన్ కటాఫ్ తక్కువ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. జీవో 77లో ఓపెన్ క్యాటగిరీ పోస్టులు నింపిన తర్వాతే రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాలనే నిబంధన స్పష్టంగా ఉందన్నారు.
News October 21, 2025
గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ లభ్యం

అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో రెండేళ్ల బాబు ఇంటి నుంచి బయటికి వచ్చి తప్పిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్లూ కోట్ పోలీసులు, ఓ కానిస్టేబుల్ ఆ బాలుడి ఆచూకీ కనుక్కున్నారు. వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులకు ఎస్పీ అభినందించారు.