News December 11, 2025
సర్పంచ్‌గా గెలిచిన చనిపోయిన అభ్యర్థి

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర సన్నివేశం వెలుగు చూసింది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా RRకాలనీ సర్పంచ్‌గా ఇటీవల మరణించిన చర్ల మురళి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై సుమారు 300కుపైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. నామినేషన్ అనంతరం మురళి మరణించడంతో గ్రామస్థులు ఆయనకే ఓటు వేశారు. దీంతో ఎన్నికల ఫలితంపై ఏం చేద్దామన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
Similar News
News December 13, 2025
చలికాలం.. కోళ్ల దాణా నిల్వలో జాగ్రత్తలు

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడి దాణా చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News December 13, 2025
హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్ ఇలా..

* రాత్రి.7.30 గంటలకు ఉప్పల్ స్టేడియానికి మెస్సీ, రాహుల్ గాంధీ, CM రేవంత్
* 7.55 గంటలకు మ్యాచ్ కిక్ ఆఫ్
* 8.06 గంటలకు గ్రౌండ్‌లోకి మెస్సీ, రేవంత్
* 8.33 గంటలకు పెనాల్టీ షూటౌట్
* 8.53 గంటలకు మెస్సీ చేతులమీదుగా విజేతకు ‘GOAT’ కప్ ప్రదానం
* 8.54 గంటలకు మెస్సీని సత్కరించనున్న సీఎం
* 8.57 గంటలకు కార్యక్రమం ముగింపు
News December 13, 2025
ఇండియాకు కోహ్లీ.. మెస్సీని కలవడానికేనా?

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియాకు చేరుకున్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. ‘గోట్ టూర్’లో భాగంగా భారత్‌లో ఉన్న మెస్సీని కోహ్లీ కలుస్తారని ప్రచారం జరుగుతోంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫ్యాన్స్‌ను మెస్సీ కలవనున్నారు. ఈ సమయంలోనే ఇద్దరు దిగ్గజాలు మీట్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత కోహ్లీ <<18500552>>లండన్<<>>కు వెళ్లడం తెలిసిందే.


