News December 16, 2025
సర్పంచ్ అభ్యర్థి మృతి.. డబ్బును తిరిగిచ్చేసిన ఓటర్లు!

TG: సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి గుండెపోటుతో మృతిచెందడంతో అతని వద్ద ఓటు కోసం తీసుకున్న డబ్బులను గ్రామస్థులు తిరిగిచ్చారు. ఈ ఘటన నల్గొండ(D) మునుగోడు(M) కిష్టాపురంలో జరిగింది. చెనగోని కాటంరాజు BRS మద్దతుతో పోటీ చేయగా 143 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓటమితో మనస్తాపానికి గురైన ఆయన గుండెపోటుకు గురై చనిపోయారు. ఓట్ల కోసం ఆయన పంచిన డబ్బును పలువురు గ్రామస్థులు జమ చేసి తిరిగి ఇచ్చేశారు.
Similar News
News December 18, 2025
ESIC హాస్పిటల్‌లో ఉద్యోగాలు

<
News December 18, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.330 పెరిగి రూ.1,34,840కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.300 ఎగబాకి రూ.1,23,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,000 పెరిగి రూ.2,24,000కు చేరింది. వెండి ధర రెండ్రోజుల్లోనే రూ.13వేలు పెరగడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 18, 2025
పొగచూరిన ఢిల్లీ.. విమానాలు, రైళ్లు ఆలస్యం

ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాల్సిన 40 విమానాలు ఆలస్యమయ్యాయి. అటు ఫాగ్ వల్ల 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డుపై వచ్చిపోయే వాహనాలేవీ కనిపించడంలేదు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికులు నెమ్మదిగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా నిన్న లక్నోలో పొగ మంచు వల్ల భారత్-సౌతాఫ్రికా టీ20 మ్యాచ్ కూడా రద్దయిన విషయం తెలిసిందే.


