News November 26, 2025
సర్పంచ్ ఎన్నికలు.. కలెక్టర్ ఇలా త్రిపాఠి వార్నింగ్

ఎన్నికల విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. విధులకు హాజరు కాకపోయినా సస్పెండ్ చేస్తామని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో ఎన్నికల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీడీఓలు, ఎంపీఓలు పోలింగ్ కేంద్రాలను మరోసారి పరిశీలించాలని ఆమె తెలిపారు.
Similar News
News February 13, 2026
దేవరకొండ: మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

దేవరకొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 20 వార్డులకు గాను 11 స్థానాలను గెలుచుకుని, స్పష్టమైన మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 6 స్థానాలకే పరిమితం కాగా, బీజేపీ కేవలం ఒక వార్డులో మాత్రమే విజయం సాధించింది. ఓటర్లు మార్పు కోరుకుంటూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో పట్టణంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.
News February 13, 2026
NLG: మున్సిపల్ ఫలితాలు.. మధ్యాహ్నానికే స్పష్టత!

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తో సహా జిల్లాలో ఆరు మున్సిపాలిటీలలో ఎన్నికల ఫలితాలు ఉదయం 8గంటలకు ప్రారంభమై11:30 వరకు పూర్తయ్యే అవకాశముంది. దేవరకొండ, చండూరు, చిట్యాల, నందికొండ, హాలియాలో 20 వార్డులలోపే ఉండడంతో లెక్కింపు ప్రారంభమైన 2 గంటల వ్యవధిలోనే వీటి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, మిర్యాలగూడ మున్సిపాలిటీ కౌంటింగ్ తుది ఫలితాలు ఉదయం 11:30 గంటలకు వెలువడనున్నాయి.
News February 13, 2026
నల్గొండ: మున్సిపల్ కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. NLG కార్పొరేషన్ ఓట్లను ఆర్జాలబావిలో, మిర్యాలగూడ, నందికొండ, హాలియా ఓట్లను అవంతిపురంలో లెక్కించనున్నారు. దేవరకొండ, చండూరు, చిట్యాల ఫలితాలను ఎస్ఎల్బీసీ గురుకుల పాఠశాలలో వెల్లడించనున్నారు. అధికారులు పటిష్ట భద్రత మధ్య ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


