News November 23, 2025
సర్పంచ్ ఎన్నికల ఖర్చు అంతే!

TG: సర్పంచ్ ఎన్నికల ఖర్చు విషయంలో ఎన్నికల సంఘం అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. 2011 సెన్సెస్ ఆధారంగా ఖర్చు ఉంటుందని వెల్లడించారు. 5వేల ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 5 వేల లోపు పంచాయతీల్లో రూ.1.50 లక్షలు, 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులకు రూ.50 వేలు, 5 వేలకు తక్కువగా ఉన్న గ్రామాల్లో రూ.30 వేల చొప్పున ఖర్చు పెట్టాల్సి ఉంటుందని వివరించారు.
Similar News
News November 24, 2025
సందీప్ వంగా డైరెక్షన్ టీమ్‌లో స్టార్ కిడ్స్

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా పూజా కార్యక్రమం నిన్న జరిగిన విషయం తెలిసిందే. చిరంజీవి చేతుల మీదుగా ఈ ప్రోగ్రామ్ జరగగా, డైరెక్షన్ టీమ్ ఆయనతో ఫొటోలు దిగింది. ఆ ఫొటోలో హీరో రవితేజ కుమారుడు మహాదన్, డైరెక్టర్ త్రివిక్రమ్ తనయుడు రిషి కూడా ఉన్నారు. వీరిద్దరూ ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి.
News November 24, 2025
INDvsSA.. భారమంతా బ్యాటర్లపైనే!

IND, SA మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో నేడు మూడో రోజు ఆట కీలకం కానుంది. భారత్ విజయావకాశాలపై ఈరోజు ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్‌లో SA భారీ స్కోర్(489) చేయడంతో IND బ్యాటర్ల బాధ్యత మరింత పెరిగింది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలంటే బ్యాటర్లు సమష్ఠిగా రాణించాల్సిన అవసరముంది. ఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ జైస్వాల్ కీలకంగా మారతారని అనిల్ కుంబ్లే అన్నారు. ప్రస్తుతం IND 480 రన్స్ వెనుకబడి ఉంది.
News November 24, 2025
ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. దరఖాస్తులకు 3 రోజులే ఛాన్స్

AP: UPSC సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష-2026కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఫ్రీ కోచింగ్ అందిస్తోంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షలు మించకూడదు. ఈ నెల 26లోగా అప్లై చేసుకోవాలి. NOV 30న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. DEC 10 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి. 340 సీట్లు ఉన్నాయి. పూర్తి వివరాలు, దరఖాస్తుకు ఇక్కడ <


