News December 17, 2025
‘సర్పంచ్’ రిజల్ట్స్.. ఒక్క ఓటుతో..

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లోనూ పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లా నలబండబోడులో కాంగ్రెస్ అభ్యర్థి ఝాన్సీపై బీఆర్ఎస్ అభ్యర్థి సింధు ఒక్క ఓటు తేడాతో గెలిచారు. మొత్తం 139 ఓట్లు పోలవ్వగా ఝాన్సీకి 69, సింధుకి 70 ఓట్లు వచ్చాయి. సంగారెడ్డి(D) బాణాపూర్‌లోనూ ఇదే రిజల్ట్ రిపీటైంది. శంకర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు.
Similar News
News December 20, 2025
PPP వివాదం.. 104, 108 ఎలా వచ్చాయని సీఎం ప్రశ్న

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వలేదని, అది పీపీపీ విధానం అని సీఎం చంద్రబాబు అనకాపల్లి సభలో స్పష్టం చేశారు. ‘పీపీపీతో మెడికల్ కాలేజీల్లో సీట్లు పెరుగుతాయి. ఎన్టీఆర్ వైద్యసేవ కింద 70% వైద్యసేవలు అందుతాయి. ప్రైవేటుకు ఇచ్చామని దుష్ప్రచారం చేస్తున్నారు. 104, 108 దేని కింద ఇచ్చారు?’ అని ప్రశ్నించారు. రూ.500 కోట్లతో రుషికొండ భవనాలు కట్టిన వ్యక్తులు ఒక్క మెడికల్ కాలేజీ కట్టలేకపోయారని విమర్శించారు.
News December 20, 2025
డివోర్స్ తీసుకోకుండా సహజీవనం కుదరదు: హైకోర్టు

పెళ్లయి విడాకులు తీసుకోకుండా మరొకరితో సహజీవనం చేస్తున్న వ్యక్తులు చట్టపరమైన రక్షణ కోరలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛకు పరిమితులున్నాయని, ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి చట్టపరమైన హక్కులను ఉల్లంఘించకూడదని తేల్చిచెప్పింది. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న తమకు పోలీసు రక్షణ కల్పించాలని ఓ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. సహజీవనం కూడా చట్టానికి లోబడే ఉండాలని పేర్కొంది.
News December 20, 2025
అమరావతి తప్ప CBNకు ఇంకేమీ పట్టదు: అమర్నాథ్

AP: అమరావతి ప్రొజెక్ట్ అయితే చాలు ఇతర ప్రాంతాలేమైపోయినా ఫర్వాలేదన్నట్లు CM ఉన్నారని YCP నేత G.అమర్నాథ్ విమర్శించారు. ‘విశాఖ భూములను తన వారికి కట్టబెట్టి అక్కడ ఏ యాక్టివిటీ లేకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. సెటిల్మెంట్లపై పవన్ IAS, IPSలను కాకుండా భూముల్ని దోచిపెడుతున్న CBNను ప్రశ్నించాలి. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు తప్పదు’ అని హెచ్చరించారు. అందర్నీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు.


