News January 29, 2026

సర్పవరంలో క్రికెట్ స్టేడియం.. స్థలాన్ని పరిశీలించిన సానా సతీశ్

image

సర్పవరం భావనారాయణ స్వామి ఆలయానికి చెందిన 16.55 ఎకరాల స్థలంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ స్థలాన్ని గురువారం ఎంపీ, క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీశ్ పరిశీలించారు. స్టేడియం ఏర్పాటుతో సర్పవరం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాస్ ఎంపీకి స్థల వివరాలను వివరించారు. స్టేడియం నిర్మాణంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందనుంది.

Similar News

News February 18, 2026

‘నేను ఇండియాకు రాలేను’.. బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!

image

తాను భారత్‌కు తిరిగి రాలేనని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు విజయ్ మాల్యా బాంబే హైకోర్టుకు తెలిపారు. తన వద్ద యాక్టివ్ పాస్‌పోర్టు లేదని, పైగా బ్రిటన్ విడిచి వెళ్లకుండా అక్కడి కోర్టుల ఆంక్షలు ఉన్నాయని ఆయన తరఫు లాయర్ అమిత్ దేశాయ్ తెలిపారు. భారత్‌కు రానంత వరకు మాల్యా పిటిషన్లను విచారించబోమని చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ నేతృత్వంలోని ధర్మాసనం గతవారం స్పష్టం చేయడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారు.

News February 18, 2026

చిత్తూరు జిల్లాపై గంజా మహ్మమారి పంజా.!

image

ఆధ్యాత్మిక నగరం తిరుపతి గంజాయి కోరల్లో చిక్కుకుంది. మదనపల్లె, రేణిగుంట, చిత్తూరు వంటి ప్రాంతాల్లో గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. బస్సులు, రైళ్ల ద్వారా గంజాయిని సరఫరా చేస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు రూటు మారుస్తున్నారు. జిల్లాలో కొందరు కీలక రాజకీయ నేతల అండదండలతో ఈ దందా సాగుతోందట. చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ మహ్మమారి ధాటికి యువత కోలుకోలేనంగా చిత్తవుతోంది.

News February 18, 2026

పాడేరు నియోజకవర్గ అభివృద్ధిపై చంద్రబాబుకు నివేదిక

image

పాడేరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు నాయుడుకు నివేదిక అందజేసినట్లు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఈశ్వరి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ..అమరావతిలో అరకు పార్లమెంటరీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జిలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమీక్షలో కూటమి చేపడుతున్న అభివృద్ధితో పాటు ప్రజల ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లామన్నారు.