News April 14, 2024
సర్‌బుజ్జిలి యువకుడి కిడ్నాప్ కలకలం

వ్యక్తి కిడ్నాప్‌కు యత్నించిన ఘటన విశాఖ ఎంవీపీ స్టేషన్ పరిధిలో జరిగింది. సరుబుజ్జిలి మండలానికి చెందిన యుగంధర్ శనివారం విశాఖలో క్యాబ్ బుక్ చేసుకొని బీజేపీ కార్యాలయం వద్ద ఉండగా అప్పుడే కారులో ఐదుగురు అతడిని బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. గమనించిన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా విశాఖకు చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉంటటంతో ఆమె భర్త కిడ్నాప్‌నకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 19, 2025
ఎచ్చెర్ల: ఫలితాలు విడుదల

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్. ఉదయ్ భాస్కర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ https://brau.edu.inలో పొందుపరిచినట్లు తెలిపారు. మొత్తం 178 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 85 మంది ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.
News December 19, 2025
నరసన్నపేట: విద్యార్థులతో కలిసి పాఠాలు విన్న DEO

నరసన్నపేటపేట మండలం సత్యవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఉదయం DEO రవిబాబు సందర్శించారు. అనంతరం ఉపాద్యాయులు చెప్పిన పాఠాలను విద్యార్థులతో కలిసి విన్నారు. విద్యాబోధన తీరును పరిశీలించిన ఆయన, పాఠశాలలోని పలు రికార్డులు పరిశీలించారు. భోజనం నాణ్యత, రుచి ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.