News February 1, 2025

సర్వర్ డౌన్.. పింఛన్ పంపిణీకి అంతరాయం

image

శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో సర్వర్ సమస్య నెలకొంది. ఉదయం 6 గంటలకు పింఛన్ అందజేసేందుకు అధికారులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లగా కొంతసేపు సర్వర్ పనిచేసింది. అనంతరం ‘processing.. please wait’ అన్న ఎర్రర్ కోడ్ వస్తుండటంతో పంపిణీకి అంతరాయం ఏర్పడింది. ఫోన్‌లో ఆ యాప్ పనిచేస్తేనే పింఛన్ పంపిణీ చేసేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తినట్లు సమాచారం.

Similar News

News September 17, 2025

కాలీఫ్లవర్‌లో బటనింగ్ తెగులు – నివారణ

image

కాలీఫ్లవర్‌ పంటలో చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బటనింగ్ అంటారు. ముదురు నారు నాటడం, నేలలో నత్రజని లోపం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజులు గల నారుని నాటుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను వేయాలి. స్వల్పకాలిక రకాలను సిఫారసు చేసిన సమయంలో విత్తడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News September 17, 2025

నమో డ్రోన్ దీదీ పథకం గురించి తెలుసా?

image

మహిళా సాధికారత కోసం కేంద్రం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే <>నమో డ్రోన్ దీదీ.<<>> మహిళా స్వయం సహాయ సంఘాల్లోని సభ్యులకు డ్రోన్ టెక్నాలజీని పరిచయం చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. మహిళా సంఘాలకు డ్రోన్లు కొనుగోలు చేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో లోన్స్ ఇస్తోంది కేంద్రం. గరిష్ఠంగా రూ.8 లక్షల వరకు రాయితీ పొందవచ్చు. డ్రోన్ కోసం కావాల్సిన మిగతా డబ్బులను 3 శాతం నామ మాత్రపు వడ్డీ రేటుతో రుణం ఇస్తోంది.

News September 17, 2025

ADB: గండర గండడు కొమురం భీముడే మన బిడ్డ..!

image

తెలంగాణ చరిత్రలో వీరత్వానికి, పోరాటానికి ప్రతీకగా నిలిచారు కొమురం భీమ్. 1901లో జన్మించిన ఈ గిరిజన యోధుడు నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడారు. ‘జల్, జంగల్, జమీన్’ అనే నినాదంతో గిరిజనులను ఏకం చేసి తమ వనరులపై ఉన్న హక్కులను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. ​1940లో జోడేఘాట్ వద్ద నిజాం పోలీసులతో జరిగిన పోరాటంలో కొమురం భీమ్ అమరుడయ్యారు. ఆయన ధైర్యం, పోరాట స్ఫూర్తి నేటికీ ఆదర్శం.