News February 28, 2026

సర్వాంగ సుందరంగా అమరావతి రివర్ ఫ్రంట్

image

AP: అమరావతిని ఆనుకొని 27 KM మేర ప్రవహించే కృష్ణా రివర్ ఫ్రంట్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు GOVT ఏర్పాట్లు చేస్తోంది. వాకింగ్ ట్రాకులు, పార్కులు, రివర్ మార్కెట్లు, థీమ్ పార్కులు, మ్యూజియమ్‌లు ఏర్పాటుచేయనుంది. ఫిట్‌నెస్ ఏరియాలు, ఫుడ్ కోర్టులు, పబ్లిక్ ప్లాజాలు, ఓపెన్ థియేటర్లు, బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబించే ఘాట్‌లు నెలకొల్పనుంది. పర్యాటక ప్రాంతంగా ఇది ఉపాధి కల్పిస్తుందని భావిస్తోంది.

Similar News

News March 1, 2026

ఆటగాళ్లు, అభిమానుల క్షేమం ముఖ్యం: ICC

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వేళ T20 WCకి వచ్చిన ప్రతి క్రికెటర్, అభిమానిని క్షేమంగా ఇంటికి పంపడం తమ బాధ్యత అని ICC తెలిపింది. ఇప్పటికే ట్రావెల్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ టీమ్‌లను సిద్ధం చేసినట్లు చెప్పింది. WC కోసం వచ్చిన, రావాలనుకునే అభిమానులు తమ సలహాలను తప్పకుండా పరిశీలించాలని కోరింది. యుద్ధం వల్ల పలు దేశాల ఎయిర్ స్పేస్‌లు ఇప్పటికే మూసివేయడంతో ICC ఈ ప్రకటన చేసింది. అటు మార్చి 8న ఫైనల్ జరగనుంది.

News March 1, 2026

పాక్‌కు చుక్కలు చూపించిన లంక

image

T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు శ్రీలంక చుక్కలు చూపించింది. ఆ జట్టును సెమీస్ చేరకుండా ఇంటికి పంపడమే కాకుండా దాదాపు గెలిచినంత పనిచేసింది. 213 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు 207 రన్స్ చేసి కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో 28 రన్స్ కొట్టాల్సి ఉండగా శనక(31 బంతుల్లో 76*) 3 సిక్సర్లు బాదడంతో పాక్ గజగజ వణికిపోయింది. అయితే చివరి రెండు బాల్స్ డాట్ కావడంతో పాక్ గట్టెక్కింది.

News March 1, 2026

ట్రంప్‌కు ఇరాన్ బిగ్ వార్నింగ్

image

యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ‘ఇప్పటివరకు మా వద్ద ఉన్న పాత ఆయుధాలనే ఉపయోగించాం. త్వరలో మేం వాడే వెపన్స్ నువ్వు ఎప్పుడూ చూసి ఉండవు’ అని హెచ్చరించింది. ఇక వెస్ట్ ఏషియాలోని 14 యూఎస్ బేస్‌లను టార్గెట్ చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దాడుల్లో వందల మంది అమెరికా సైనికులు మరణించినట్లు పేర్కొంది. అయితే దీన్ని US ధ్రువీకరించలేదు.