News December 30, 2025

సర్వికల్ క్యాన్సర్ లక్షణాలివే..

image

గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా మానవ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల వస్తుంది. యోని రక్తస్రావం, యోనిలో మార్పులు, సెక్స్ సమయంలో నొప్పి, తుంటి భాగంలో నొప్పి వస్తుంటే అవి సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు. ఈ లక్షణాలుంటే పాప్ స్మెర్మ్, HPV పరీక్షలు చేయించుకోవాలి. HPV అట్-హోమ్ సెల్ఫ్-టెస్టింగ్ కిట్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 25 ఏళ్లు పైబడిన మహిళలు ఈ టెస్టులు చేయించుకోవడం మంచిది.

Similar News

News January 1, 2026

CM పర్యటనలపై వాస్తవాలు చెప్పాలి: సుధాకర్

image

AP: CM CBN విదేశీ పర్యటనలపై ప్రజలకు వాస్తవాలు చెప్పాలని YCP నేత సుధాకర్‌బాబు డిమాండ్ చేశారు. ‘GADలోనూ సమాచారం లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి సింగపూర్ వెళ్లి ఉంటారనే ప్రచారం ఉంది. CM, లోకేశ్, పవన్‌ల పర్యటనల ఖర్చును వెల్లడించాలి. తన సొంత డబ్బుతో మాజీ CM జగన్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్తే నానా యాగీ చేసిన CBN CMగా తన పర్యటనను రహస్యంగా ఉంచడంలో మర్మమేమిటి’ అని ప్రశ్నించారు.

News January 1, 2026

సౌదీలో ఏడాదిలో 356 మందికి మరణశిక్ష

image

సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు రికార్డు స్థాయికి చేరింది. 2025లో ఏకంగా 356 మందికి మరణ దండన అమలు చేసింది. ముఖ్యంగా డ్రగ్స్ రవాణాపై సౌదీ ప్రభుత్వం ప్రకటించిన యుద్ధం కారణంగానే ఈ సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మొత్తం శిక్షల్లో 243 డ్రగ్స్ కేసులే కావడం గమనార్హం. ఓవైపు పర్యాటకం, క్రీడలతో ఆధునిక దేశంగా ఎదగాలని యత్నిస్తున్న సౌదీ, మరోవైపు ఈ స్థాయిలో మరణశిక్షలు అమలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

News January 1, 2026

అంచనాకు మించి అయ్యప్ప బంగారం చోరీ: SIT

image

శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం చోరీ అంచనా కంటే ఎక్కువే అని కొల్లాం కోర్టుకు SIT తెలిపింది. సన్నిధానం తలుపులకు గల ఆకృతులతో పాటు శివుడి విగ్రహం, ఆర్చ్, ద్వారపాలక విగ్రహాలు సహా 7ఆకృతుల్లో పసిడి చోరీ అయిందని రిపోర్టు సమర్పించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ విగ్రహాల బాధ్యతలు చేపట్టాక 4.5KGల మేర బంగారాన్ని రికార్డుల్లో రాగి అని మార్చాడని పేర్కొంది. చెన్నైలో కెమికల్స్‌తో బంగారం కరిగించారని తెలిపింది.