News December 31, 2025
సర్వీస్ ఛార్జ్ బాదుడు.. రెస్టారెంట్‌కు ₹50,000 ఫైన్

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్ వసూలు చేసినందుకు ముంబైలోని బోరా బోరా రెస్టారెంట్‌కు CCPA ₹50,000 ఫైన్ వేసింది. కస్టమర్ అనుమతి లేకుండానే 10% సర్వీస్ ఛార్జ్ కలిపింది. దానిపై అదనంగా GST కూడా వసూలు చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని CCPA స్పష్టం చేసింది. సర్వీస్ ఛార్జ్ పూర్తిగా స్వచ్ఛందమని గుర్తుచేసింది. దీన్ని హోటళ్లు, రెస్టారెంట్ తప్పనిసరి చేయొద్దని ఢిల్లీ హైకోర్టు గతంలోనే తీర్పిచ్చింది.
Similar News
News February 20, 2026
ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లు!

ఆరోగ్యకర జీవితానికి 8 అలవాట్లను అలవరచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘నిద్ర లేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా గడపండి. 10 నిమిషాలు ఎండలో ఉండండి. తిన్నాక 10 నిమిషాలు నడవండి. వారంలో 3 సార్లయినా పెరుగు, యోగర్ట్, కెఫీర్ తీసుకోండి. మందు, సిగరెట్లు వద్దు. పసుపు, జీలకర్ర, సోంపు, మిరియాలను ఆహారంలో చేర్చుకోండి. 12 గం. భోజన సమయాన్ని ఫాలోకండి.. మిగతా 12 గం. ఏమీ తినొద్దు. 7-8 గంటలు నిద్రపోండి’ అని చెబుతున్నారు.
News February 20, 2026
సంతోషిమాత వ్రతం: పాటించాల్సిన నియమాలు

ఈ వ్రతంలో అత్యంత కఠినమైన నియమం పులుపు పదార్థాలకు దూరంగా ఉండటం. వ్రతం చేసే వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆ రోజున నిమ్మకాయ, చింతపండు, పెరుగు ముట్టుకోకూడదు. ఇంట్లో పులుపుతో వంటలు చేయకూడదు. వ్రతం రోజున అబద్ధాలు ఆడటం, ఇతరులను దూషించడం చేయరాదు. పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అమ్మవారి నామస్మరణ చేయాలి. నైవేద్యంగా పెట్టిన బెల్లం, శనగలను మాత్రమే ప్రసాదంగా తీసుకోవాలి.
News February 20, 2026
తానెంత గొప్ప బ్యాటరో అభిషేక్ గుర్తుచేసుకోవాలి: నాసర్ హుసేన్

భారత స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ మానసిక సమస్య వల్ల పరుగులు చేయలేకపోతున్నారని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసర్ హుసేన్ అభిప్రాయపడ్డారు. ‘<<19180377>>మూడు డకౌట్లు<<>> మానసికంగా ఇబ్బందిపెడతాయి. అభిషేక్ మంచి హిట్టర్. అతడు తన గత ప్రదర్శనలు గుర్తు చేసుకోవాలి. తన భారీ ఇన్నింగ్సుల వీడియోలను తెప్పించుకుని చూడాలి. తాను ఎంత గొప్ప బ్యాటర్ అనేది అభిషేక్ గుర్తు చేసుకోవాలి’ అని సూచించారు.


