News April 16, 2025
సర్వేను పకడ్బందీగా చేపట్టాలి: ADB DEO

యూడైస్లో నమోదైన సంఖ్య మేరకు విద్యార్థులు, పాఠశాల భౌతిక, వసతులపై డైట్ ఛాత్రోపాధ్యాయులు చేస్తున్న థర్డ్ పార్టీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని డీఈవో శ్రీనివాసరెడ్డి అన్నారు. బేల అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో సర్వే తీరును ప్లానింగ్ కోఆర్డినేటర్ నారాయణతో కలిసి ఆయన పరిశీలించారు. పాఠశాల రిపోర్టు కార్డులో నమోదైన వివరాల ద్వారా భౌతిక పరిశీలన చేసి ధ్రువీకరించాలని సూచించారు. ఈనెల 21వరకు సర్వే కొనసాగుతుందన్నారు.
Similar News
News April 19, 2025
ADB: అమ్మాయిని వేధించాడు.. అరెస్టయ్యాడు

సోషల్ మీడియా ద్వారా బోథ్ పట్టణానికి చెందిన ఒక అమ్మాయిని వేధించిన కేసులో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తికి చెందిన అలీమ్ బేగ్ అనే వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు SI ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అతడిని రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. నిందితుడిపై రెంజల్ పోలీస్ స్టేషన్‌లో ఇదివరకే నాలుగు కేసులు, రౌడీ షీట్ ఉన్నాయని తెలిపారు.
News April 19, 2025
ADB: ఈ నెల 20న MJP బ్యాక్ లాగ్ సెట్

ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర, బాలికల గురుకులాల్లోని 6,7,8,9 వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు RCO శ్రీధర్ తెలిపారు. ఎంజేపీ బ్యాక్‌లాగ్ సెట్ ఈ నెల 20న ఉంటుందన్నారు. ఉమ్మడి జిల్లాలో 12 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,308 విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 10 నుంచి పరీక్ష ప్రారంభమవుతుందని, గంట ముందే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
News April 19, 2025
ADB: మళ్లీ జిల్లాకు వచ్చిన మన కలెక్టర్లు

గతంలో ADB జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన ఇద్దరు IASలు మళ్లీ జిల్లాకు వచ్చి గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. రామకృష్ణారావు, బుద్ధప్రకాశ్ జ్యోతి ఇద్దరు పుసాయిలో శుక్రవారం జరిగిన భూ భారతి కార్యక్రమంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రామకృష్ణారావు, రెవెన్యూ(రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్) సెక్రటరీగా ప్రకాశ్ పనిచేస్తున్నారు.