News March 24, 2024

సర్వేపల్లిలో బావ.. కోవూరులో బావమరిది 

image

కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావబావమరుదులు. దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేనల్లుడు. మేనమామ వద్దే సోమిరెడ్డి రాజకీయ ఓనమాలు దిద్దారు. 2009 ఎన్నికల వరకు సోమిరెడ్డి, ప్రసన్న ఇద్దరూ టీడీపీలోనే కొనసాగారు. ఆ తర్వాత సోమిరెడ్డి టీడీపీలోనే కొనసాగుతుండగా, ప్రసన్న వైసీపీలో చేరిపోయారు.

Similar News

News October 31, 2025

కండలేరుకు నిధులు ఇవ్వాలని వినతి

image

కండలేరులో 11 కిలోమీటర్ల మేర కట్ట నిర్మించి 30 ఏళ్లు అవుతోంది. దీన్ని పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీజేపీ నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేశ్ తెలిపారు. డ్యాం సాధారణ మెయింటెనెన్స్‌కు నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావుకు ఆయన వినతిపత్రం అంందజేశారు.

News October 31, 2025

నెల్లూరు జిల్లాలోని ఇళ్లపై విచారణ: మంత్రి

image

నెల్లూరు జిల్లాలో గత ప్రభుత్వం నాసిరకం ఇళ్లను కట్టిందని గృహనిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నెల్లూరులోని టీడీపీ ఆఫీసులో ఆయన మాట్లాడుతూ.. ఓ కాంట్రాక్ట్ సంస్థ ఈ ఇళ్లను నిర్మించిందన్నారు. వారిపై విజిలెన్స్ విచారణ చేయిస్తామని.. నగదు రికవరీ చేయడమా? క్రిమినల్ కేసులు పెట్టడమా? అనేది త్వరలో చెబుతామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల మంజూరు చేస్తామన్నారు.

News October 31, 2025

నెల్లూరు: ఇండోసోల్ అంశంపై హైకోర్ట్ మొట్టికాయలు

image

ఇండోసోల్ పరిశ్రమకు చెరువుల్లోని మంచినీటిని ఎలా ఇస్తారంటూ హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా చెరువుల్లోని తాగునీటిని ఇండోసోల్ పరిశ్రమకు తరలిస్తున్నారంటూ గుడ్లూరు(M) చేవూరు, కావలి(M) చెన్నాయపాలెం ప్రజలు హైకోర్టులో పిల్ వేశారు. దానిపై విచారించిన ధర్మాసనం సమగ్ర నివేదిక ఇవ్వాలని నెల్లూరు(D) కలెక్టర్‌ను ఆదేశించింది.