News February 21, 2025

సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం కలకలం

image

సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం కలకలం రేపింది. వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామానికి చెందిన కొందరు రైతులు గేదెల కోసం పొలాల వద్దకు వెళ్లగా సర్వేపల్లి కాలువలో గుర్తుతెలియని మహిళ(35) మృతదేహం కొట్టుకుపోతుండగా గమనించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. చీకటి పడడంతో మృతదేహం ఆచూకీ తెలయలేదు. మహిళ ప్రమాదవశాత్తు కాలువలో పడిందా, లేక సూసైడ్ చేసుకుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 3, 2026

తిరుపతిలో మెహన్ బాబు, విష్ణుపై కేసులు

image

తిరుపతిలో విద్యార్థి సంఘాల <<19040348>>కిడ్నాప్<<>> వ్యవహారంలో మోహన్ బాబు, మంచు విష్ణు, MBU PRO సతీశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్‌ను పోలీసులు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిపై తిరుచానూరు PSలో కేసు నమోదు అయింది.

News February 3, 2026

BREAKING.. కాకాణికి నోటీసులు

image

మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్బషలాడారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.

News February 3, 2026

నెల్లూరు KVR పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం

image

నెల్లూరు నగరం KVR పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో బైకుపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించి గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు నెల్లూరు వేదయపాలెంకు చెందిన మల్లికార్జున్, భరత్‌గా తెలుస్తుంది. అయితే ఢీకొట్టిన టిప్పర్ పరారవడం విశేషం.