News May 14, 2024

సర్వేపల్లి స్ట్రాంగ్ రూమ్‌‌కు సీల్

image

సర్వేపల్లి నియోజకవర్గంలో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పకడ్బందీ భద్రత మధ్య నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అధికారులు సీల్ వేశారు.

Similar News

News March 4, 2026

నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

image

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.

News March 4, 2026

నెల్లూరు జిల్లా నేతలకు నారా లోకేశ్ ఆత్మీయ విందు

image

నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులకు ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు జిల్లాకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలు అంశాలపై మంత్రి వారితో చర్చించారు. అనంతరం అందరికీ కానుకలు అందజేశారు.

News March 3, 2026

నెల్లూరు: ప్రేమికుల మృతి.. ఎలా గుర్తించారంటే?

image

రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులోని అడవిలో ప్రేమికులు <<19290866>>ఆత్మహత్య <<>>చేసుకున్న విషయం తెలిసిందే. మృతులు ముత్తుకూరు మండలం పంటపాలేనికి ఆలపాక ప్రసన్న కుమార్‌(24), చిట్టమూరు మండలం చింతలతోపునకు చెందిన ఎం.సావిత్రి(26)గా గుర్తించారు. తేనె సేకరణ కోసం అడవిలోకి వెళ్లిన పంగిలి గ్రామస్థులు మృతదేహాలను చూశారు. సమీపంలోని బైకుపై దొరికిన హ్యాండ్ బ్యాగులో ఉన్న ఫోన్ల ఆధారంగా మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.