News November 23, 2025

సర్వేలులో పీవీ, నారాయణరెడ్డి కాంస్య విగ్రహాల ఆవిష్కరణ

image

ప్రతి విద్యార్థికి చదువు, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. సర్వేలు గురుకుల విద్యాలయంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి ఆయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, భూదానోద్యమ నాయకుడు, గురుకుల స్థలదాత మద్ది నారాయణరెడ్డిల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించారు.

Similar News

News November 23, 2025

ఏడీఈ పోస్టింగ్స్‌లో పైరవీల హంగామా!

image

NPDCLలో ఏఈ నుంచి ఏడీఈలుగా ప్రమోషన్ పొందిన ఇంజినీర్ల పోస్టింగ్స్‌పై పైరవీలు జోరుగా సాగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల పేర్లు చెప్పుకుంటూ ముగ్గురు అసోసియేషన్ నేతలు డబ్బులు వసూలు చేసినట్టుగా సమాచారం. కోరుకున్న చోట పోస్టింగ్‌ కల్పిస్తామని హామీలు ఇచ్చినట్టు చెబుతున్నారు. WGL జోన్‌లో 30-40 AE, 70-80 ADE పోస్టులకు పదోన్నతుల ప్రక్రియ జరుగుతోంది. దీంతో అర్హులకు న్యాయం చేయాలంటున్నారు.

News November 23, 2025

వరంగల్: టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఇన్‌ఛార్జ్ పదోన్నతులు

image

టీజీ ఎన్పీడీసీఎల్‌లో నెలలుగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు ఎట్టకేలకు ఇన్‌ఛార్జ్‌గా పదోన్నతులు ఇచ్చి యాజమాన్యం ముగింపు పలికింది. కోర్టు కేసుల కారణంగా రెగ్యులర్ పదోన్నతులు జాప్యం కావడంతో పాలనపరమైన ఇబ్బందులు తలెత్తాయి. వాటి నివారణకు ముగ్గురు ఎస్ఈలను చీఫ్ ఇంజినీర్లుగా, ఆరుగురు డీఈలను ఎస్ఈలుగా, 21 మందిని డీఈలుగా పదోన్నతి చేశారు. అలాగే, కొన్ని పరిపాలనా హోదాలకు కూడా ఇన్‌ఛార్జ్ ప్రమోషన్లు మంజూరు చేశారు.

News November 23, 2025

వరంగల్: ఎన్పీడీసీఎల్‌లో భారీ పదోన్నతులు

image

ఎన్పీడీసీఎల్‌లో పలువురు అధికారులకు పదోన్నతులు కల్పించారు. కార్పొరేట్ కార్యాలయం ఆపరేషన్ విభాగం జీఎంగా పని చేస్తున్న ఎ.సురేందర్‌ను చీఫ్ ఇంజినీర్‌గా, ఎమ్మార్టీ జీఎం ఎం.అన్నపూర్ణ దేవిని ఎమ్నార్టీ చీఫ్ ఇంజినీర్‌గా నియమించారు. ఏడుగురు అకౌంట్స్ ఆఫీసర్లు, ఆరుగురు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లకు సీనియర్ AOలుగా పదోన్నతులు ఇచ్చారు. పలు జిల్లాల్లో ఎస్ఈ, జీఎం స్థాయిలో బదిలీలు, నియామకాలు నిర్వహించారు.