News October 22, 2025

సర్వేలో పాలుపంచుకోండి: కలెక్టర్‌ అనుదీప్‌

image

రాష్ట్ర భవిష్యత్‌ రూపకల్పనకై ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్‌–2047’ సిటిజన్‌ సర్వేలో ప్రతి పౌరుడు పాల్గొనాలని జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి పిలుపునిచ్చారు. ప్రజల నుంచి సూచనలు సేకరించడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఈ నెల 25తో సర్వే ముగుస్తుందని, అర్హులైన పౌరులు తమ సలహాలను www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్‌లో తప్పక నమోదు చేయాలని ఆయన కోరారు.

Similar News

News October 22, 2025

ఖమ్మం: తపాల శాఖ ఏజెంట్లకు.. దరఖాస్తుల ఆహ్వానం

image

తపాలా శాఖ బీమా పథకాలు పోస్టల్ జీవిత బీమా పీఎల్ గ్రామీణ తపాలా జీవిత బీమా(ఆర్పీఎస్ఐ) లకు సంబంధించి కమీషన్ పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన వాళ్లు చేసి, 18 ఏళ్ల వయస్సు నిండిన నిరుద్యోగులు, గృహిణులు అంగన్వాడీ సేవకులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అర్హులని, ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 22, 2025

ఖమ్మం: రెండు పదవులకు 66 మంది పోటీ

image

ఖమ్మం కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్ష పదవుల ఎంపికపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డీసీసీకి 56, నగర కమిటీకి 10 మంది దరఖాస్తు చేసుకోగా, ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ ఆరుగురి పేర్లను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. ఐదేళ్లుగా కాంగ్రెస్‌కు విధేయులుగా ఉన్నవారికే పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యనేతల బంధువులు అర్హులు కాదన్న నిబంధనతో వడపోత పూర్తయి, నవంబర్ 15న తుది జాబితా వెలువడనుంది.

News October 22, 2025

ఖమ్మం DCC పీఠం కమ్మ సామాజిక వర్గానికేనా..?

image

ఖమ్మం DCC అధ్యక్ష పీఠం కోసం అంతర్గత రాజకీయం రగులుతుంది. Dy.CM భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. భట్టి వర్గం నుంచి వేమిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నూతి సత్యనారాయణ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. భట్టి వ్యూహాత్మకంగా కమ్మ వర్గం అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచినట్లు సమాచారం. స్థానికత, సామాజిక సమీకరణలపై ఆధారపడి అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.