News March 13, 2025
సలహాలు, సూచనలు ఇవ్వండి: విశాఖ కలెక్టర్

ఈఆర్వో, డీఈవో, సీఈవో స్థాయిలో పరిష్కారంకాని ఏవైనా సమస్యలపై భారత ఎన్నికల సంఘానికి నేరుగా సూచనలు ఇవ్వొచ్చని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కోరారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఆహ్వానం తెలుపుతూ ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిందని కలెక్టర్ వివరించారు. రాజకీయ పార్టీలకు విడివిడిగా ఎన్నికల సంఘం లేఖలు పంపినట్లు పేర్కొన్నారు.
Similar News
News July 4, 2025
విశాఖ జిల్లాలో 636 పాఠశాల్లో వైద్య పరీక్షలు

DMHO జగదీశ్వరరావు ఆదేశాల మేరకు విశాఖలో పాఠశాల విద్యార్థులకు జూలై 3నుంచి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పలు పాఠశాలు, అంగన్వాడీ కేంద్రాలలో మెడికల్ ఆఫీసర్, ఎఎన్ఎమ్‌లు ఆరోగ్య పరీక్షలు చేశారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చే శారీరక ,మానసిక లోపాలను గుర్తించి సరైన వైద్యసేవలను ఇవ్వనున్నారు. జిల్లాలో 636 పాఠశాలల్లో 96,159 మంది, 914 అంగన్వాడీలలో 56,371 మందికి పరీక్షలు చేస్తారు.
News July 4, 2025
విశాఖ జిల్లా టీచర్లకు గమనిక

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాద్యాయ అవార్డులు 2025కు ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రభుత్వ/ ప్రైవేటు/ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. http://nationalawardstoteacher.education.gov.in వెబ్‌సైట్ ద్వారా జులై 13లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అర్హత, వివరాలకు వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవాలని తెలిపారు.
News July 4, 2025
బ్యాంకర్లకు విశాఖ కలెక్టర్ కీలక ఆదేశాలు

సామాన్యుల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు సహకారం అందించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగు హాలులో శుక్రవారం సమావేశమయ్యారు. స్వయం సహాయ సంఘాల సభ్యులకు అందించే రుణాలను సకాలంలో రెన్యువల్ చేయాలని, వారి పొదుపు ఖాతాలోని 50శాతం సొమ్మును ఆటోమేటిక్‌గా ఎఫ్.డి. చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.