News December 12, 2025

సలీల్ అరోరా.. 39 బంతుల్లోనే సెంచరీ

image

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మరో శతకం నమోదైంది. ఝార్ఖండ్‌తో మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ సలీల్ అరోరా కేవలం 39 బంతుల్లోనే సెంచరీ చేశారు. సలీల్ చేసిన 125 రన్స్‌లో 102(11 సిక్సులు, 9 ఫోర్స్) పరుగులు బౌండరీల ద్వారానే వచ్చాయి. అటు 19వ ఓవర్లో సలీల్, గౌరవ్ రెచ్చిపోయారు. వరుసగా 4, 6, 6, 1, 6, 4(27 రన్స్) బాదేశారు. IPLలో అరోరా వికెట్ కీపర్ కేటగిరీలో రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో లిస్ట్ అయ్యి ఉన్నారు.

Similar News

News December 12, 2025

ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో ఢిల్లీ పెద్దలతో భేటీకానున్నారు. 18న సాయంత్రం విజయవాడ నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకోనున్నారు. అదేరోజు రాత్రి పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఆమోదాలు, అనుమతులపై చర్చించే అవకాశం ఉంది. 19న సాయంత్రం తిరిగి విజయవాడ బయల్దేరనున్నారు.

News December 12, 2025

రెండో విడత ప్రచారానికి తెర

image

TGలో రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12 వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పోలింగ్‌కు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.

News December 12, 2025

‘అఖండ-2’ సీక్వెల్ ఉంటుందా?

image

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజవ్వగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఎండ్ కార్డ్‌లో ‘జై అఖండ’ అనే టైటిల్ పోస్టర్ ఇవ్వడంతో సీక్వెల్‌పై చర్చ మొదలైంది. కాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న ‘నెట్‌ఫ్లిక్స్’లో త్వరలో ‘అఖండ-2’ స్ట్రీమింగ్ కానుంది. మూవీ చూసిన వారు ఎలా ఉందో కామెంట్ చేయండి.