News April 8, 2025
సలేశ్వరం జాతర ఏర్పాట్లపై సమీక్షించిన జిల్లా కలెక్టర్

లింగాల మండలంలో ప్రతి సంవత్సరం పౌర్ణమికి జరిగే సలేశ్వరం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో జాతర జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ప్రసిద్ధ జాతరకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ, రెవెన్యు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 5, 2026
KNR: ‘ట్రేడ్ లైసెన్స్ లేకుండా అక్రమ వ్యాపారం’

ఉమ్మడి జిల్లాలోని 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారులు అక్రమంగా కోట్లు సంపాదించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. వ్యాపార వాణిజ్య సముదాయాల నుంచి వచ్చే టాక్స్ మున్సిపాలిటీలకు ప్రధాన ఆదాయం. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో అధికారులను మేనేజ్ చేస్తూ పన్నుల చెల్లింపును ఎగ్గొడుతున్నారు. ఫలితంగా ఏటా రూ.కోట్ల ఆదాయానికి గండి పడుతోంది.
News January 5, 2026
సత్తుపల్లి: నీటి సంపులో పడి వ్యక్తి మృతి

సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో ప్రమాదవశాత్తూ నీటి సంపులో పడి ఓలేటి వెంకటరమణ (50) అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన మొక్కజొన్న పొత్తులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించేవారు. సంపులో పడిన వెంకటరమణను గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News January 5, 2026
ప్రాణాలు కాపాడుకొని.. సవాల్ విసరాలని!

మార్చి 31 నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామన్న కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎంతోమంది కీలక నేతలు మరణించగా అనేక మంది లొంగిపోయారు. ప్రస్తుతం దళంలో కొంతమందే మిగిలారు. అయితే డెడ్‌లైన్ నాటికి ప్రాణాలు కాపాడుకొని తమను నిర్మూలించలేరంటూ కేంద్రానికి సవాల్ విసరాలని వారు భావిస్తున్నట్లు సమాచారం. తిప్పిరి తిరుపతి సారథ్యంలోని దళాలు బలగాల కంటికి చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి.


