News July 24, 2024
సహకార సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ సహకారశాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్‌లో బుధవారం జరిగింది. పీఎసీఎస్‌ల సామర్థ్యం, పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 78 పీఎసీఎస్‌లను నాబార్డు జాతీయ సాఫ్ట్‌వేర్ నెట్‌వర్కుకు అనుసంధానం చేసిందన్నారు.
Similar News
News January 17, 2025
2 నెలల పాటు అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేత
రాష్ట్రవ్యాప్తంగా రెండు నెలల పాటు అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ నిలిపివేస్తున్నట్లు జిల్లా రిజిస్టర్ బాలాంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
News January 17, 2025
నెల్లూరు: ఆర్నెల్ల క్రితమే పెళ్లైంది.. ఇంతలోనే విషాదం
సరదాగా గడిపి సేదతీరేందుకు వెళ్లిన ముగ్గురిని కడలి బలితీసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన మాధవ(25)కు, నెల్లూరు జిల్లా, కందుకూరు(M), అనంతసాగరానికి చెందిన నవ్వతో ఆర్నెల్ల క్రితం పెళ్లి అయ్యింది. సంక్రాంతి సందర్భంగా బంధువులు, స్నేహితులతో కలిసి వారు పాకల బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో అలల్లో చిక్కుకుని మాధవ, నవ్య సోదరి యామిని, మాధవ బాబాయ్ కుమార్తె జెస్సికా మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
News January 17, 2025
నెల్లూరు: గుండెపోటుతో MLA తమ్ముడి మృతి
వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు కురుగొండ్ల శేఖర్ కన్నుమూశారు. డక్కిలి మండలం కమ్మవారిపల్లికి చెందిన శేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ గుంటూరులో స్థిరపడ్డారు. ఈక్రమంలో నిన్న రాత్రి భోజనం చేసిన తర్వాత గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వెంటనే గుంటూరుకు బయల్దేరారు.