News March 19, 2026
సహజీవన జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. గుజరాత్‌లో UCC బిల్

గుజరాత్ ప్రభుత్వం అసెంబ్లీలో UCC(యూనిఫామ్ సివిల్ కోడ్) బిల్లును ప్రవేశపెట్టింది. దీని ప్రకారం సహజీవనంలో ఉండే జంటలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నెలలోగా ఇలా చేయకపోతే 3M జైలు శిక్ష/₹10K ఫైన్, ఒక్కోసారి రెండూ విధిస్తారు. బలవంతం/మోసపూరితంగా వ్యవహరిస్తే ఐదేళ్ల జైలు శిక్ష ఉంటుంది. మత ఆధారిత చట్టాల స్థానంలో పెళ్లి, విడాకులు, భరణం, వారసత్వం, దత్తత విషయంలో పౌరులందరికీ ఒకే రూల్స్ వర్తిస్తాయి.
Similar News
News April 14, 2026
850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు!

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనుంది. ఆర్టికల్ 55, 81కు సవరణలు చేపట్టనుంది. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిపైనా చర్చ జరగనుంది.
News April 14, 2026
బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి

బిహార్ కొత్త సీఎంగా బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఆయనను అధికారికంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల అధినేతలు ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా సీఎం పదవికి కాసేపటి క్రితం నితీశ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
News April 14, 2026
రియల్ హీరో❤️

వేసవిలో పక్షులకు కాసిన్ని నీళ్లు పెట్టడానికే మనం విసుగు చెందుతాం. కానీ గుజరాత్ జూనాగఢ్‌కు చెందిన హర్సుఖ్‌భాయ్ వఘాసియా మాత్రం పదివేల పక్షులకు ‘అన్నదాత’గా మారారు. 28 ఏళ్ల క్రితం ఒక పిట్టతో మొదలైన ఆయన ప్రయాణం.. నేడు 4 ఎకరాల్లో 10వేల పక్షుల కడుపు నింపే స్థాయికి చేరింది. దీనికోసం ఆయన ఏటా ₹2 లక్షలు ఖర్చు చేస్తున్నారు. విలాసాలకు దూరంగా ఉంటూ మూగజీవాల సేవకే జీవితాన్ని అంకితం చేసిన వఘాసియా నిజమైన హీరో.


