News April 17, 2024
సహనకు కంగ్రాట్స్ చెప్పిన స్మితా సబర్వాల్

కరీంనగర్‌కు చెందిన కొలనుపాక సహన సివిల్స్ ఫలితాల్లో 739వ ర్యాంకు సాధించారు. గతంలో కరీంనగర్ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన స్మితా సబర్వాల్ తనకు ఆదర్శమన్నారు. ఏ క్యాడర్ వచ్చినా IAS కావడమే లక్ష్యమని పేర్కొన్నారు. తన రోల్ మోడల్ స్మితా సబర్వాల్ అని సహన పేర్కొనగా.. ట్విట్టర్‌లో స్మిత స్పందించారు. ‘ప్రియమైన సహన.. మీ ఎంపికకు శుభాకాంక్షలు. So proud of you’ అంటూ అభినందనలు తెలిపారు.
Similar News
News July 11, 2025
కరీంనగర్: ట్రాన్స్ జెండర్లకు శుభవార్త

ట్రాన్స్‌జెండర్ల ఉపాధికి తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్‌లో ప్రత్యేక పథకం చేపట్టిందని జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్థిక స్వావలంబనకై వారికీ డ్రైవింగ్, బ్యూటీషియన్ వంటి నైపుణ్య శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు జూలై 23, 2025లోగా www.wdsc.telangana.goవ్.inలో దరఖాస్తు చేయాలని, వివరాలకు 040-24559050ను సంప్రదించాలని వివరించారు.
News July 11, 2025
కరీంనగర్: రేపే చివరి అవకాశం

KNR జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం నుంచి MBC నిరుద్యోగులకు HYDలో ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ ప్రకటన విడుదలైంది. 4 రోజుల ఈ శిక్షణలో సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నేర్పుతారు. భోజన, వసతి, ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తారు. 21-30 ఏళ్ల మధ్య వయస్సు, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 12లోపు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని BC డెవలప్మెంట్ ఆఫీసర్ అనిల్ ప్రకాష్ కిరణ్ తెలిపారు.
News July 11, 2025
KNR: 24 గంటల్లో దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

కరీంనగర్ మారుతి నగర్‌లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు నాగరాజు, సదాశివను అరెస్టు చేసినట్లు మూడవ పట్టణ సీఐ జాన్ రెడ్డి తెలిపారు. నిందితులు బంగారు గొలుసు అమ్మేందుకు వెళ్తుండగా చాకచక్యంగా అరెస్టు చేసి, నిందితుల వద్ద బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.