News August 29, 2025

సహాయక చర్యలు వేగవంతం: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

image

గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేశామని, సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ముంపునకు గురైన జీఆర్ కాలనీతో పాటు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో బాధితులకు వేడి ఆహారం, సురక్షితమైన తాగునీరు, ఇతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

Similar News

News August 30, 2025

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: మహబూబ్‌నగర్ కలెక్టర్

image

పాలమూరు జిల్లా కేంద్రంలో శుక్రవారం డ్రై డే సందర్భంగా కలెక్టర్ విజయేందిర బోయి వివిధ కాలనీలను పరిశీలించారు. బీకే రెడ్డి కాలనీలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లేకపోతే వైరల్ ఫీవర్ సోకే ప్రమాదం ఉందన్నారు.

News August 30, 2025

అభ్యంతరాలు ఉంటే తెలపాలి: వనపర్తి కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల ముసాయిదా ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే MPDO దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. జాబితా, వార్డులు, పోలింగ్ కేంద్రాల విషయంలో అవంతరాలు ఉంటే ఆయా మండలాల ఎంపీడీవో లదృష్టికి తీసుకెళ్లి సరి చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News August 30, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.