News March 21, 2025
సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగైన సేవలు: పల్నాడు SP

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని మెరుగైన సేవలందించాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నూతన చట్టాలపై అవగాహన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉన్నత విద్యను అభ్యసించిన కానిస్టేబుళ్లు ఉన్నారని అన్నారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పాటు ఇవ్వాలని కోరారు.
Similar News
News September 17, 2025
ఆర్టీసీలో 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. TGSRTCలో 1,743 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,000 డ్రైవర్, 743 శ్రామిక్(మెకానిక్, ఫిట్టర్, షీట్ మెటల్, ఆటో ఎలక్ట్రిషియన్, పెయింటర్, వెల్డర్, అప్ హోల్స్టర్, మిల్‌రైట్ మెకానిక్) పోస్టులకు అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ ప్రకటించింది. మరిన్ని వివరాలకు ఇక్కడ <
News September 17, 2025
NRPT: స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం: కలెక్టర్

గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. నారాయణపేటలోని జడ్పీ కార్యాలయంలో బుధవారం ‘స్వచ్ఛతా హి సేవ’ వాల్‌పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. డ్రైనేజీలు, రోడ్లు శుభ్రం చేయాలని, చెత్తాచెదారం తొలగించాలని అన్నారు. ఈనెల 25న ఒక గంట పాటు అధికారులు పాల్గొనాలని ఆదేశించారు.
News September 17, 2025
ఖమ్మం: నిజాంకు వ్యతిరేకంగా తనికెళ్ల వీరుల పోరాటం

నిజాం పాలనకు వ్యతిరేకంగా తనికెళ్ల గ్రామ ప్రజలు సాగించిన పోరాటం అత్యంత కీలకమని నిజాం వ్యతిరేక పోరాట యోధులు గుర్తుచేశారు. కొణిజర్లకు చెందిన దొండపాటి వెంకయ్య, షేక్ మహబూబ్ అలీతో పాటు తనికెళ్లకు చెందిన గడల సీతారామయ్య, రామకృష్ణయ్య, ముత్తయ్య, యాస వెంకట లాలయ్య, మల్లెల వెంకటేశ్వరరావు దళంలో చేరి పోరాడారు. ఈ క్రమంలో రజాకారుల నుంచి సీతారామయ్యను గ్రామస్థులు తెలివిగా తప్పించిన వైనం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.