News October 7, 2025

సాంకేతిక విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్ హనుమంతరావు

image

యువత సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుతో పాటు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం ఆలేరులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఏటీసీ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న కోర్సుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 7, 2025

మెళియాపుట్టి: పిడుగుపాటు ఘటనలో మృతులు వీరే

image

మెలియాపుట్టి మండలంలోని జంగాలపాడు గ్రానైట్ క్వారీ వద్ద మంగళవారం పిడుగుపాటుకు గురై మృతిచెందిన కార్మికుల వివరాలు ఇలా ఉన్నాయి. జ్ఞానేశ్వర్(రాజస్థాన్), పింటు(మధ్యప్రదేశ్), కుమార్(క్వారీ మేనేజరు,బీహార్) ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. వీరు గత కొన్నాళ్లుగా క్వారీలో కార్మికులుగా ఉన్నారు.

News October 7, 2025

తాడ్వాయి: రేపు మేడారం హుండీల లెక్కింపు

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీలను లెక్కించనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల ఆలయ ప్రాంగణాల్లొ ఏర్పాటు చేసిన హుండీలను హుండీల కౌంటింగ్ హాల్‌లో బుధవారం లెక్కించనున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు, పూజారులు హాజరుకానున్నారు.

News October 7, 2025

వరంగల్ పరిధిలో 23 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు

image

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 23 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. సోమవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 22 మందితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరు పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. వీరందరికీ కోర్టు జరిమానా విధించిందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.