News November 1, 2024

సాగర్ కాలువలో పడి వ్యక్తి మృతి

image

మిర్యాలగూడ మండలం తక్కెళ్ళపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ (32) సాగర్ ఎడమ కాలువలో పడి మృతి చెందాడు. గురువారం ఉదయం ఉద్యోగానికి వెళ్లిన హరికృష్ణ కాలువలో విగతజీవిగా పడి ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండడంతో హరికృష్ణ మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News

News February 21, 2026

మునుగోడు: యజమాని మృతి.. శ్మశానం వద్దే వేచిచూస్తున్న కుక్క!

image

మునుగోడు మండలం కిష్టాపురంలో చోటుచేసుకున్న ఈ ఘటన మనుషుల మధ్య బంధాలకంటే మూగజీవాల విశ్వాసం గొప్పదని మరోసారి నిరూపించింది. తనను ప్రాణప్రదంగా చూసుకున్న యజమాని పార్వతమ్మ మరణాన్ని ఆ కుక్క తట్టుకోలేకపోయింది. అంత్యక్రియలు ముగిసినా, మండుటెండలో శ్మశానం వద్దే ఉండిపోవడం ఆ మూగజీవికి ఉన్న అనురాగానికి నిదర్శనం. ఈ హృదయ విదారక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

News February 21, 2026

నల్గొండ: పర్యాటక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్: కలెక్టర్

image

జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ప్రకృతి సంపదను వినియోగించుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఇందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు.