News April 11, 2025

సాగర్ కాల్వలకు నీటి నిలిపివేత

image

గతేడాది డిసెంబర్ 15 నుంచి అధికారులు సాగర్ కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం సాయంత్రం నీటి విడుదలను నిలిపివేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల వరకు సాగవగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలు సాగైంది. ఈ సీజన్ లో ఎడమ కాల్వకు 74 టీఎంసీల వాటర్ రిలీజ్ చేయగా, కుడి కాల్వకు 100 టీఎంసీలు విడుదల చేశారు.

Similar News

News November 9, 2025

జగిత్యాల: క్వింటాల్ మక్కలు రూ.2,071

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ దినుసుల ధరలు ఇవాళ ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,071, కనిష్ఠ ధర రూ.1,600, వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.1,940, కనిష్ఠ ధర రూ.1,750, వరి ధాన్యం(BPT) గరిష్ఠ ధర రూ.2,041, కనిష్ఠ ధర రూ.1,980, వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,585, కనిష్ఠ ధర రూ.1,800గా పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

News November 9, 2025

మూసాపేటలో హైడ్రాకు మద్దతు.. ప్లకార్డులతో హర్షం

image

హైడ్రాకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కబ్జాల నుంచి పార్కులను విడిపించుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డామో, ఎన్ని ఏళ్లుగా పోరాడామో హైడ్రా రావడంతో అవన్నీ మా సొంతం అయ్యాయని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పార్కులు కాపాడి ప్రాణవాయువును అందించిన హైడ్రాకు ధన్యవాదాలంటూ ర్యాలీ నిర్వహించారు. మూసాపేటలోని ఆంజనేయ నగర్‌లో పార్కుకు చేరుకుని స్థానికులు హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు.