News July 17, 2024
సాగర్ కుడి కాలువకు తాగునీటి విడుదల

తెలంగాణ, ఏపీకి తాగు నీటిని విడుదల చేసేందుకు కృష్ణా రివర్ బోర్డ్ అనుమతించిన నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్ర ప్రాంతం పరిధిలోని కుడి కాల్వకు డ్యాం అధికారులు 5,598 క్యూసెక్కుల తాగునీటిని విడుదల చేశారు. సాగర్ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 504.40 అడుగుల నీరు నిల్వ ఉంది. HYD తాగునీటి అవసరాల కోసం ఎస్ఎల్బీసీకి 800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
Similar News
News August 13, 2025
వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: నల్గొండ డీఎంహెచ్ఓ

సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. నల్గొండ శివారులోని పానగల్ యూపీహెచ్‌సీని ఇవాళ ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మందుల నిల్వలను తనిఖీ చేశారు. జ్వరాల విషయంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వెంటనే స్పందించాలని సిబ్బందికి ఆయన సూచించారు.
News August 12, 2025
నల్గొండ: హ్యామ్ కింద రోడ్ల నిర్మాణానికి శ్రీకారం: మంత్రి

హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్&బీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క పాల్గొన్నారు. హైబ్రిడ్ యాన్యుటి మోడ్ (హ్యామ్) కింద భారీగా రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.
News August 12, 2025
ఆ ఇద్దరు దద్దమ్మలే.. జగదీశ్ రెడ్డి సెటైర్

ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులిద్దరూ దద్దమ్మలేనని మరోసారి రుజువైందని మాజీ మంత్రి, MLA జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఉదయసముద్రంను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడారు. కృష్ణా బేసిన్‌లోకి పుష్కలంగా నీరు వస్తుంటే చెరువులు నింపాల్సింది పోయి గేట్లు ఎత్తి నీళ్లను సముద్రంలోకి వదులుతున్నారన్నారు. జిల్లాలో చెరువులు నింపాలని డిమాండ్ చేశారు.