News April 2, 2026

సాగర్ రికార్డు ‘పవర్’: రాష్ట్రంలోనే నంబర్ 1

image

జలవిద్యుత్ ఉత్పత్తిలో సాగర్ ప్రధాన జలవిద్యుత్ కేంద్రం నయా రికార్డు సృష్టించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోనే అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసిన కేంద్రంగా నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ఏడాది ఏకంగా 2,572.04 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసి సాగర్ తన సత్తా చాటిందని జెన్‌కో CE మంగేష్ కుమార్ వెల్లడించారు. 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అత్యధిక ఉత్పత్తి జరగడం విశేషం.

Similar News

News April 2, 2026

సిరిసిల్ల : ఇక నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలో ఈ సర్వీసులు

image

సెస్ పరిధిలోని సర్వీసు మీటర్లు ఇది వరకు ఈ కింది విధంగా ఉన్నాయి. గృహాలు 174598, వాణిజ్య 22283, పరిశ్రమలు 1497, పవర్లుమ్ 3479, వ్యవసాయ 80888, స్ట్రీట్ లైట్స్ 1409, నీటి సరఫరా 1869, జనరల్ 1111, ఈవీ (హెచ్టి హైటెన్షన్) 1, హెచ్పీ దాటానివి 127 ఉండగా మొత్తం 287375 కనెక్షన్స్ ఉన్నాయి. ఈ సర్వీసులన్ని ఇక నుంచి ఎన్పీడీసీఎల్ పరిధిలో కొనసాగనున్నాయి. 3,86,000 మంది వినియోగదారులకు ఎన్పీడీసీఎల్ సేవలు అందించనుంది.

News April 2, 2026

జయంతి ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ రాజర్షి షా

image

ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మహనీయుల జీవిత చరిత్రపై ఫొటో ఎగ్జిబిషన్, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయాలన్నారు. వేడుకల ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్ దీపాలు, పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు.

News April 2, 2026

ప్రత్తిపాడు క్వారీలో పేలుళ్ల కలకలం.. పరుగులు తీసిన కూలీలు

image

ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి వద్ద ఓ స్టోన్ క్రషర్ క్వారీలో బుధవారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. బ్లాస్టింగ్ ధాటికి నల్లరాతి పర్వతం కుప్పకూలడంతో రాళ్లు మీద పడి జేసీబీ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు ప్రాణభయంతో పరుగులు తీశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రుడిని గుట్టుచప్పుడు కాకుండా కాకినాడ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనతో మైనింగ్ ప్రాంతం దద్దరిల్లిపోయింది.