News October 23, 2024
సాగునీటి సంఘ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ మొదలైనందున జిల్లాలోని అధికారులు సమిష్టిగా కృషి చేసి ఈ నెల 31 నాటికి ఓటరు జాబితా తయారు చేయాలని కలెక్టర్ ఒ.ఆనంద్ కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నుండి రెవెన్యూ, మున్సిపాలిటీ, ఉపాధి హామీ, హౌసింగ్ మొదలైన అంశాలపై సబ్‌కలెక్టరు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Similar News
News November 8, 2025
ఉలవపాడు: చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

ఉలవపాడు మండలంలోని చాకిచర్ల పెద్ద పట్టపుపాలెంకు చెందిన యువకుడు శనివారం సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. SI అంకమ్మ తెలిపిన వివరాలు ప్రకారం.. పెదపట్టపుపాలెంకు చెందిన వాయిల చంద్రయ్య, ఆయన కుమారుడు రాజు ఉదయం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా సముద్రపు అలల ధాటికి బోటు తిరగబడింది. ఆ ఘటనలో రాజు చనిపోయినట్లు తెలిపారు.
News November 8, 2025
NLR: 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర

నెల్లూరు జిల్లా జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న వైసీపీ ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించే ఈ యాత్ర జరగనుంది. వాల్ పోస్టర్లను నెల్లూరులో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. ఎమ్మెల్సీలు మాధవరెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
News November 8, 2025
నెల్లూరు: 15 నుంచి నీరు విడుదల

నెల్లూరు జిల్లా రైతులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శుభవార్త చెప్పారు. జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాల నుంచి ఈనెల 15న నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. నెల్లూరులో ఇవాళ జరిగిన IAB సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రబీ సీజన్లో రైతులకు ఇబ్బంది లేకుండా నీళ్లు అందిస్తామన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు సైతం సోమశిల నుంచి నీరిస్తామని స్పష్టం చేశారు.


