News March 16, 2025
సాగు, తాగు నీటికి ఆటంకాల్లేని నిరంతర విద్యుత్: మంత్రి

బత్తలపల్లె మండలం అప్పరాచెరువులో రూ.1.62 కోట్లతో అప్ గ్రేడ్ చేసిన 11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా అప్పరాచెరువు, చెన్నపట్నం, జ్వాలాపురం గ్రామాలకు త్రీ ఫేజ్ నిరంతర విద్యుత్ అందుబాటులో ఉంటుందన్నారు. సాగు, తాగు నీటికి ఆటంకాల్లేని విద్యుత్ అందుతుందని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యుత్ సమస్యలు తీర్చాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 23, 2025
క్లుప్తంగా చెప్పాలంటే ఇదే రైతు జీవితం..

వర్షం కాన రాదు.. కరవు పోదు.. కష్టం తరగదు.. ప్రకృతి తీరు మారదు.. బ్యాంకు రుణం తీరదు.. కన్నీళ్ల తడి ఆరదు.. రేపటి మీద ఆశ చావదు.. క్లుప్తంగా చెప్పాలంటే అన్నదాత జీవితం ఇదే. చేతి నిండా అప్పులున్నా, పేదరికం పగబట్టినా, నిరాశ ఆవహిస్తున్నా, నిస్సహాయుడిగా మిగిలినా.. తాను నమ్ముకున్న భూమి ఏనాటికైనా తన కష్టం తీరుస్తుందన్న నమ్మకంతో బతికే ఆశాజీవి ‘రైతు’ మాత్రమే. అన్నదాతలకు ‘జాతీయ రైతు దినోత్సవ’ శుభాకాంక్షలు.
News December 23, 2025
పీవీ సేవలు చిరస్మరణీయం: హరీశ్ రావు

తెలంగాణ ముద్దుబిడ్డ, భారత రత్న, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు వర్థంతి సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు నివాళులు అర్పించారు. భారతదేశ రాజకీయ, ఆర్థిక రంగాలను కొత్త దిశగా మలిచిన మహోన్నత నాయకుడిగా పీవీ చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలే నేటి అభివృద్ధికి పునాదిగా మారాయన్నారు. పీవీ సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
News December 23, 2025
గోవిందరాజస్వామి ఆలయంపై 30 విగ్రహాలు తొలగించారు..?

గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై ఉన్న విగ్రహాలను బంగారు తాపడం పనుల నేపథ్యంలో తొలగించారు. అనేక దేవతామూర్తుల విగ్రహాలు నేడు కనిపించడం లేదని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై హై కోర్టులో కూడా తప్పుడు నివేదికలు సమర్పించారని అంటున్నారు. ఇదంతా ఆనాటి అధికారులు, అర్చకులు, జీయర్ స్వాములతో సహా ముఖ్యులు తెలిసే జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.


