News January 24, 2025

సాతర్లలో కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

జోగులాంబ గద్వాల జిల్లాలో హెచ్చుతగ్గు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో మొన్నటి వరకు చలి తీవ్రత పెరిగిన.. రెండు రోజులుగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటలలో సాతర్లలో 15.4 డిగ్రీలు, చిన్న తాండ్రపాడులో 15.6 డిగ్రీలు, బూడిదపాడులో 15.9 డిగ్రీలు, వడ్డేపల్లి, తోతినొనిదొడ్డిలో 16.1 డిగ్రీలు, ధరూర్, జల్లాపూర్‌లో 17.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News March 4, 2026

NTR: రూ.38.83 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

image

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే రక్షణ దళం చేపట్టిన ప్రత్యేక చర్యల్లో కీలక ఫలితాలు సాధించినట్లు చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో ఆపరేషన్ నార్కోస్ కింద రూ.38.83 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 11 మందిని అరెస్టు చేసి, అధికారులకు అప్పగించామన్నారు. ఆపరేషన్ సతర్క్‌లో భాగంగా రూ.1,65,505ల విలువైన మద్యాన్ని సీజ్ చేశామన్నారు.

News March 4, 2026

రానున్నాయ్ మహిళా పెట్రోల్ బంకులు

image

TG: ప్రతి జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ‘ఇందిరా మహిళాశక్తి’ కింద వీటిని నెలకొల్పుతారు. జిల్లా యంత్రాంగం ఈ పెట్రోలు బంకులకు అవసరమైన భూమిని 30 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ ప్రతిపాదనల్ని మెప్మాకు అందించాలి. ALF, TLFలు వీటికి నిధులు సమకూరుస్తాయి. ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రాలజీ ఇలా వివిధ ప్రొసీజర్లు పూర్తి చేయాలి. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే దీని లక్ష్యం.

News March 4, 2026

వేములవాడ: నేడే అసలైన హోలీ

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో హోలీ వేడుకలను బుధవారం జరుపుకోనున్నారు. ఫాల్గుణ పౌర్ణిమ రోజున హోలీ వేడుకలు జరుపుకోవాల్సి ఉండగా, కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా 4వ తేదీ (బుధవారం) హోలీ జరుపుకోవాలని పండితులు సూచించారు. ఈ మేరకు బుధవారం వేములవాడతో పాటు అనేక ప్రాంతాల్లో హోలీ జరుపుకోనున్నారు. ప్రభుత్వ సెలవు కారణంగా కొన్ని ప్రాంతాల్లో మంగళవారం హోలీ జరుపుకున్నారు.