News December 26, 2025
సాత్విక పొలిటికల్ ఎంట్రీ.. కోమటిరెడ్డి ఆశీర్వాదం

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైన దుబ్బ సాత్విక గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన రాజకీయ ప్రస్థానానికి మద్దతు తెలపాలని కోరుతూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అందరి సహకారంతో పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో ముందుండి పనిచేస్తానని ఈ సందర్భంగా సాత్విక పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
యూరియా కోసం క్యూలో ఉండక్కర్లేదు: అదనపు కలెక్టర్

రైతులకు యూరియా పంపిణీలో ఇబ్బందులు కలగకుండా ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఉదయాదిత్య భవన్‌లో నిర్వహించిన ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్’ శిక్షణలో మాట్లాడుతూ.. సాంకేతికతతో పంపిణీని వేగవంతం చేయాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద 3 కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఉదయం 6 గంటల నుంచే విక్రయాలు ప్రారంభించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 30, 2025
రేపటి నుంచి బాల కార్మికుల గుర్తింపు: నల్గొండ ఎస్పీ

జిల్లాలో బాల కార్మిక వ్యవస్థపై ఉక్కుపాదం మోపేందుకు ‘ఆపరేషన్ స్మైల్-11’ సిద్ధమైంది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు రేపటి నుంచి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగనున్నాయి. ఇటుక బట్టీలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో తనిఖీలు నిర్వహించి వెట్టిచాకిరీలో ఉన్న చిన్నారులను రక్షిస్తామని అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
News December 30, 2025
నల్గొండ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు: కలెక్టర్

నల్గొండ జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. రబీ సీజన్‌కు అవసరమైన యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.


