News August 19, 2025
సాదియా బేగానికి బంగారు పతకం

పరిగి నియోజకవర్గానికి చెందిన డీఎస్టీవో నసీరుద్దీన్ పెద్ద కుమార్తె సాదియా బేగానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ ఇంగ్లిష్‌లో 2023- 24 ఓయూ టాపర్‌గా నిలిచింది. మంగళవారం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా బంగారు పతకం అందుకున్నారు. ఈమె పదో తరగతి పరిగి గొంసలొ గార్సియా ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో చదివి వికారాబాద్ జిల్లా టాపర్‌గా నిలిచింది.
Similar News
News August 19, 2025
సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే చరిత్రలోనే రికార్డు

సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే చరిత్రలో మహిళలు రికార్డ్ సాధించారు. జోన్‌లోని 5 కీలకమైన వాణిజ్య, ఆపరేటింగ్, ఫైనాన్స్, సెక్యూరిటీ, వైద్య విభాగాలను మహిళా అధికారులు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్స్ మేనేజర్‌గా కె.పద్మజ, భద్రత విభాగానికి అరోమాసింగ్ ఠాకూర్, ప్రధాన ఆర్థిక సలహాదారుగా హేమ సునీత, వాణిజ్యానికి కమర్షియల్ మేనేజర్‌గా ఇతి పాండే, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా నిర్మల నరసింహన్ ఉన్నారు.

తీరనున్న యూరియా కష్టాలు!

తెలంగాణలోని రైతులకు యూరియా కష్టాలు త్వరలో తీరనున్నాయి. 50వేల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గుజరాత్, కర్ణాటక నుంచి యూరియా తరలింపునకు ఆదేశించింది. మరో వారం రోజుల్లోనే రాష్ట్రానికి యూరియా వస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా చాలాచోట్ల రైతులు ఆందోళనలు చేపట్టారు.