News January 23, 2026
సాఫ్ట్‌బాల్ స్టేట్ ఛాంపియన్ మన నిజామాబాద్

కమ్మర్‌పల్లిలో జరిగిన 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్(అండర్-17) పోటీల్లో నిజామాబాద్ జిల్లా జట్లు సత్తా చాటాయి. బాల, బాలికల విభాగాల్లో NZB జట్లు స్టేట్ ఛాంపియన్‌గా నిలిచినట్లు జిల్లా కార్యదర్శి నాగమణి తెలిపారు. బాలుర విభాగంలో వరంగల్(2వ), ఆదిలాబాద్(3), బాలికల విభాగంలో మెదక్(2), మహబూబ్‌నగర్(3) స్థానాల్లో నిలిచాయి. విజేతలు ఫిబ్రవరిలో ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికయ్యారు.
Similar News
News April 1, 2026
సంగారెడ్డి: గురుకుల కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని సీఓఈ గురుకులాల్లో ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 7లోపు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఈ నెల 19న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. అర్హులైన గిరిజన విద్యార్థులు www.tgtwreis.telangana.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News April 1, 2026
ఇరాన్ యుద్ధం.. అమెరికాతో విభేదించిన బ్రిటన్

ఇరాన్ యుద్ధం విషయంలో <<19525908>>అమెరికా<<>>తో బ్రిటన్ విభేదించింది. ఈ ఘర్షణల్లోకి ప్రవేశించేది లేదని PM స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంతో సంబంధం లేనప్పటికీ.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఘర్షణల్ని ఆపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హార్ముజ్ పున:ప్రారంభానికి ఉన్న మార్గాల్ని అన్వేషించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.
News April 1, 2026
విశాఖ రైల్వే డివిజన్‌కు మరో రికార్డు

వాల్తేరు రైల్వే డివిజన్ మరోసారి రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం సాధించిన డివిజన్లలో 5వ స్థానం, వృద్ధిలో తొలి స్థానం దక్కించుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 85.1 మిలియన్ టన్నుల లోడింగ్‌తో 17.25% వృద్ధి నమోదైంది. మొత్తం ఆదాయం రూ.11,598 కోట్లకు చేరి 17% పెరిగింది. ప్రయాణికుల సంఖ్య 33.42Mకి చేరగా రూ.881 కోట్ల ఆదాయం లభించింది. ఈ వివరాలను వాల్తేరు డివిజన్ DRM లలిత్ బోహ్రా వెల్లడించారు.


