News February 1, 2026

సాఫ్ట్‌వేర్ రంగానికి ఊరట: ట్యాక్స్ రూల్స్‌లో బిగ్ అప్‌డేట్!

image

IT, సాఫ్ట్‌వేర్ రంగంలో పన్నుల గందరగోళానికి చెక్ పెడుతూ నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. IT, ITeS, KPO, కాంట్రాక్ట్ R&D సేవలను విడివిడిగా కాకుండా వాటన్నింటినీ కలిపి IT సర్వీసెస్ అనే ఒకే కేటగిరీగా గుర్తిస్తారు. వీటన్నింటికీ ఒకే ‘Safe Harbour Framework’ వర్తించడం వల్ల ట్యాక్స్ రూల్స్ సింపుల్‌గా మారతాయి. మరోవైపు ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి రానుంది.

Similar News

News February 13, 2026

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌కు వర్షం ముప్పు?

image

ఎన్నో ట్విస్టులు, మరెన్నో వివాదాల తర్వాత ఎల్లుండి ఇండియా-పాక్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే మ్యాచ్ వేదిక కొలంబోకు వర్షం ముప్పు పొంచి ఉంది. సాయంత్రం అక్కడ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం 50-65% ఉందని Accuweather అంచనా వేసింది. కొలంబోలో కొన్ని రోజులుగా వాన పడుతోందని సమాచారం. ఈనెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శ్రీలంక IMD చెప్పడం గమనార్హం.

News February 13, 2026

బంగ్లాదేశ్ ఎన్నికల్లో 2 బ్యాలెట్లు.. ఎందుకు?

image

బంగ్లాదేశ్ <<19125261>>ఎన్నికలు<<>> 2 బ్యాలెట్లతో జరిగాయి. అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఒక బ్యాలెట్ పేపర్, ‘జులై ఛార్టర్’పై రెఫరెండానికి రెండోది. 2025 అక్టోబర్‌లో 25 పార్టీలు చేసుకున్న ఒప్పందమే జులై ఛార్టర్‌. దీన్ని అమలు చేయాలని మెజారిటీ(65%పైగా) ప్రజలు ఓటు వేసినట్లు సమాచారం. PM పదవీ కాలంపై పరిమితులు, EC బలోపేతం, PM నుంచి ప్రెసిడెంట్‌కు అధికారాల బదిలీ వంటివి ఇందులో ఉన్నాయి. 180 పని దినాల్లో ఈ సంస్కరణలు అమలు చేయాలి.

News February 13, 2026

ఈ సెంటిమెంట్ రిపీటైతే టీ20 వరల్డ్ కప్ ఇండియాదే!

image

జింబాబ్వే సంచలన విజయం టీమ్ఇండియా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 1983 ODI WC, 2007 T20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లోనూ జింబాబ్వే ఆసీస్‌ను చిత్తు చేయడంతో ఆ అరుదైన ‘సెంటిమెంట్’ రిపీట్ అవుతుందని గూగుల్ ఇండియా విశ్లేషించింది. ఈ లక్కీ ఫ్యాక్టర్ నిజమైతే SKY సేన కప్పు గెలవడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.