News April 1, 2025
సామర్లకోటలో క్షుద్ర పూజలు కలకలం

సామర్లకోట శివారు బ్రౌన్ పేట కందకం ప్రాంతంలో క్షుద్ర పూజలు కలకలం ఏర్పడింది. ఇంటి ముందు స్టార్ తరహాలో ముగ్గు వేసి, పసుపు, కుంకుమ మధ్యలో నిమ్మకాయలు ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు ప్రజలను వేధించేందుకు ఇలా చేస్తున్నట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. కొద్దిపాటి అనారోగ్యం వచ్చినా క్షుద్ర పూజల ప్రభావం అనే భావన ప్రజల్లో నెలకొంది.
Similar News
News September 17, 2025
రజాకార్లకు వణుకు పుట్టించిన ఐలమ్మ..!

భూమికోసం విస్నూరు దేశ్ ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డితో వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ప్రపంచ స్థాయిలో ఇప్పటికీ గుర్తుండిపోయింది. భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిని విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం ఆ రోజుల్లో రజాకార్లకు వెన్నులో వణుకు పుట్టించింది. జనగామ జిల్లా పాలకుర్తిలో 1945లో ఆంధ్ర మహాసభ ఏర్పాటై, రైతాంగ సాయుధ పోరాటానికి నాంది పలికింది.
News September 17, 2025
మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించింది ఇక్కడే..!

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు మహిళలు నగ్నంగా ఆడి పాడాలని రజాకార్ల పాలనలో విస్నూరు దొర ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని విస్నూరు గ్రామంలో అలాంటి ఆకృత్యాలకు సాక్ష్యంగా ఇప్పటికీ అక్కడ విస్నూరు గడి కనిపిస్తోంది. విస్నూరు దేశ్ ముఖ్ రామచంద్రారెడ్డి అరాచకాలకు కేంద్రబిందువే ఈ గడి. మాట వినని వారిని రజాకారులతో ఈ గడికి తీసుకువచ్చి చిత్రహింసలు పెట్టేవారు.
News September 17, 2025
నల్గొండ: రాచకొండల్లో ‘పెళ్లిగుట్ట’.. స్టోరీ ఇదే

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాచకొండ గుట్టలు కమ్యూనిస్టు గెరిల్లా దళాలకు కేంద్రంగా ఉండేవి. రామన్నపేట, భువనగిరి ప్రాంతాల్లో ప్రజా పోరాటాలు నిర్వహించే వెంకటనర్సింహారెడ్డి, కృష్ణమూర్తి నాయకత్వంలోని గెరిల్లా దళాలు రక్షణ కోసం రాచకొండకు చేరాయి. గెరిల్లా దళ నేత కృష్ణమూర్తి వివాహం రాచకొండలోనే జరిగింది. ఆనాడు వివాహం నిర్వహించిన గుట్టను ఇప్పటికీ ‘పెళ్లి గుట్ట’గా పిలుస్తుంటారు.