News November 19, 2025
సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.
Similar News
News March 6, 2026
థియేటర్లలో ఫ్రీ పార్కింగ్.. హైకోర్టు భారీ ఊరట

TG: థియేటర్ల పార్కింగ్ విషయంలో ప్రేక్షకులకు హైకోర్టు భారీ ఊరట కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ కోసం ఎలాంటి ఫీజు వసూలు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు పార్కింగ్ ఫీజు వసూలు చేయడానికి గతంలో ప్రభుత్వం ఇచ్చిన 121 GOను కోర్టు సస్పెండ్ చేసింది. ఇక మల్టీప్లెక్సుల్లో సినిమా టికెట్ చూపిస్తే పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందనే విషయం తెలిసిందే.
Share It
News March 6, 2026
భద్రాద్రి రామయ్య కళ్యాణం, పట్టాభిషేకం టికెట్లు సిద్ధం

భద్రాద్రి క్షేత్రంలో ఈ నెల 27, 28 తేదీలలో జరగనున్న శ్రీరామనవమి తిరుకళ్యాణ మహోత్సవం, మహా పట్టాభిషేక వేడుకలకు సంబంధించి టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చినట్లు EO తెలిపారు. భక్తులు రేపటి నుంచి https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తమ టికెట్లను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్నట్లు EO వివరించారు.
News March 6, 2026
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో సమగ్ర అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలు వివిధ విభాగాల సమన్వయంతో నిర్వహించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతి శాఖకు సంబంధించి నోడల్ విభాగాలు, నోడల్ అధికారులు నియమించబడినట్లు తెలిపారు.


