News November 19, 2025
సామర్లకోటలో పట్టుబడ్డ మహిళలు హిడ్మా అనుచరులే..!

సామర్లకోట మండలం కొప్పవరం వద్ద పోలీసులకు పట్టుబడ్డ ఇద్దరు మహిళలు మావోయిస్టు అగ్రనేత హిడ్మాకు ప్రధాన అనుచరులేని పోలీస్ వర్గాల సమాచారం. హిడ్మాకు ఆ ఇద్దరు మహిళలు గన్మెన్‌గా వ్యవహరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడ్డ మహిళ మావోయిస్టులను అంకిత (27) అనూష(25) గా పోలీసులు గుర్తించారు. కాకినాడ వైపు నుంచి సామర్లకోట వస్తుండగా కొప్పవరం వద్ద పట్టుబడ్డారు.
Similar News
News April 5, 2026
మలయప్ప స్వామి విశిష్ఠత ఇదే.!

రహస్యమైన మలయప్ప కోనలో లభించిన విగ్రహాలు తరువాత మలయప్ప స్వామిగా ప్రసిద్ధి చెందాయి. తమిళంలో “మలై కని వుండ్రు పెరుమాళ్” అని పిలిచే ఈ స్వామి, కొండ లోయలో ప్రత్యక్షమైన దేవరూపంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆజ్ఞతో ప్రతిష్ఠించిన ఈ ఉత్సవమూర్తులు అన్ని ఉత్సవాల్లో పాల్గొంటాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల్లో మలయప్ప స్వామి ఊరేగింపులు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ గుహను నేటికీ వైకుంఠ తీర్థంగా భావించడం విశేషం.
News April 5, 2026
భారత ఎగుమతులపైనా యుద్ధ ప్రభావం: సెంట్రల్ కామర్స్ సెక్రెటరీ

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే భారత ఎగుమతులపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని సెంట్రల్ కామర్స్ సెక్రెటరీ రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ‘ఇప్పటికే దిగుమతులపై ప్రభావం పడింది. వెస్ట్ ఏషియా కూడా ముఖ్యమైన మార్కెట్. ఎగుమతుల్లో 12-13% అక్కడికే వెళ్తున్నాయి. వీటిపై యుద్ధ ప్రభావం ఎంతనేది 2-3 వారాల్లో స్పష్టత వస్తుంది. అన్ని రంగాల్లో ఇబ్బందులను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.
News April 5, 2026
మెదక్: 3 నెలల రేషన్.. 30 వరకు పంపిణీ

మెదక్ జిల్లాలో 520 రేషన్ దుకాణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల సన్న బియ్యం సరఫరా జరుగుతోందని జిల్లా సివిల్ సప్లై అధికారి నిత్యానంద్ తెలిపారు. లబ్ధిదారులు తొందరపడకుండా ఈ నెల 30 వరకు సమీప రేషన్ దుకాణాల్లో సరుకులు పొందాలని సూచించారు. సరుకుల కొరత లేదని, పారదర్శకంగా పంపిణీ జరుగుతుందని చెప్పారు. వదంతులు నమ్మకుండా అవసరమైతే అధికారులను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.


