News September 10, 2025

సామర్లకోట: ఉచిత బస్సు పథకం రద్దు కోరుతూ పాదయాత్ర

image

ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలంటూ విశాఖపట్నం నుంచి అమరావతికి చింతకాయల శ్రీనివాసరావు అనే ఆటో కార్మికుడు చేపట్టిన పాదయాత్ర బుధవారం సామర్లకోటకు చేరింది. కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో ఆటో కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. ఆటో కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలని శ్రీనివాస్ కోరారు.

Similar News

News September 10, 2025

నేపాల్‌లో చిక్కుకున్న కాకినాడ మహిళలు

image

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 38 మంది యాత్రికులు నేపాల్‌లో చిక్కుకున్నారు. వీరిలో కాకినాడకు చెందిన దాట్ల రోజారాణి (45), బుద్ధరాజు సరళ (65) ఉన్నారు. వారి వివరాలను సరళ బంధువు బుద్ధరాజు సత్యనారాయణ రాజు వెల్లడించారు. ఈ విషయంపై ఆయన మంత్రి లోకేశ్‌తో మాట్లాడారు. లోకేశ్ స్పందించి, వారిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు హామీ ఇచ్చారు.

News September 10, 2025

ఓదెల రైల్వే ట్రాక్ మరమ్మతులు పరిశీలన

image

ఓదెల మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న రైల్వే ట్రాక్ మరమ్మతులను డీఆర్‌ఎం గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. ఈ పనుల కారణంగా ఈ నెల 7 నుంచి 13 వరకు 31వ గేటును మూసివేశారు. ప్రత్యేక రైలులో వచ్చిన ఆయన పనుల పురోగతిని సమీక్షించి, అనుకున్న సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

News September 10, 2025

BREAKING: నిర్మల్: పిడుగు పడి ముగ్గురు మృతి

image

పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతిచెందిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలంలో ఈరోజు చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు అలెపు ఎల్లయ్య, అల్లెపు ఎల్లవ్వతో పాటు మరో వ్యక్తి బండారు వెంకటి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రాలకు పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగు పడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.