News March 27, 2024
సామర్లకోట: ఏప్రిల్ 1 నుంచి పలు రైళ్లు రద్దు

ఏప్రిల్ 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 4 రైళ్లను పూర్తిగా, పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు సామర్లకోట రైల్వేస్టేషన్ మేనేజర్ రమేష్ తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలో పట్టాల మరమ్మతుల కారణంగా విశాఖపట్నం- మచిలీపట్నం, గుంటూరు- విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే 4 రైళ్లను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. రామవరప్పాడు- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 8 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.
Similar News
News September 29, 2025
రాజమండ్రి: నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు తూ.గో కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. డివిజన్, మండల స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం ఉంటుందని ఆమె వెల్లడించారు. ప్రజలు తమ సమస్యలు, అభ్యర్థనలను meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే నమోదు చేసిన అర్జీల స్థితి, సంబంధిత వివరాల కోసం 1100 నంబరుకు కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు.
News September 28, 2025
రాజమండ్రి: రేబిస్‌ను నిర్లక్ష్యం చేయొద్దు: డీఎంహెచ్‌వో

రేబిస్ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే అది ప్రాణాంతకమవుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. కే. వెంకటేశ్వరరావు హెచ్చరించారు. రాజమండ్రిలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. జిల్లాలో కుక్కల కాటు కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. కుక్క కరిచిన వెంటనే వైద్య సాయం తీసుకోకపోతే రేబిస్ ముప్పు ఎక్కువవుతుందని, వెంటనే టీకాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
News September 28, 2025
కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోంది: తలారి

కొవ్వూరు మండలం కాపవరం పంచాయతీ గోవర్ధనగిరి మెట్టలో ఆదివారం ‘బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, కొవ్వూరు వైసీపీ సమన్వయకర్త తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు వాటిని అమలు చేయలేక ప్రజలను మోసం చేస్తుందని ప్రజలు గమనించాలని ఆయన అన్నారు.