News December 17, 2024
సామర్లకోట: కొనసాగుతున్న పోలీస్ పహారా

సామర్లకోట మండలం వేట్లపాలెంలో పోలీస్ పహారా కొనసాగుతోంది. ఇరువర్గాల దాడిలో ముగ్గురు మృతి చెందడంతో వేట్లపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సోమవారం రాత్రి నుంచి పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. DSP నిరంతరం అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు
Similar News
News August 18, 2025
కేంద్రమంత్రిని మంత్రిని కలిసిన మినిస్టర్ దుర్గేశ్

న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను మంత్రి కందుల దుర్గేశ్
సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధిపై చర్చించారు. లేపాక్షిలో కల్చరల్ సెంటర్ రూ.103కోట్లు, లంబసింగిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ & టూరిజం అభివృద్ధి రూ.99.87 కోట్లు, బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్టుల డీపీఆర్‌ను మంత్రికి సమర్పించారు.
News August 18, 2025
తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
News August 17, 2025
తూ.గో: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మ.1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు తమ అర్జీలను అందజేయొచ్చన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గూర్చి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.